Thalliki Vandanam Scheme 2025: ఈ క్రమంలో అధికారులు లబ్ధిదారులందరూ మీ ఆధార్ కార్డును బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలి అంటూ సూచిస్తున్నారు. అలాగే ఎన్పీసీఐ లింకేజ్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. లబ్ధిదారులు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీకు సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ సంప్రదించాలి అంటూ అధికారులు సూచిస్తున్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో తల్లికి వందనం మరియు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయబోతుంది. ఇప్పటికే ఈ పథకాల కోసం లబ్ధిదారులందరూ కూడా తమ ఆధార్ కార్డును బ్యాంకు ఖాజాతో అనుసంధానం చేసుకోవాలి అంటూ అధికారులు సూచించడం జరిగింది. ఈ పథకాల కింద నగదు బదిలీ కోసం ప్రతి ఒక్కరూ ఆధార్ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవడం తప్పనిసరిగా ప్రభుత్వం సూచించింది. అలాగే అధికారులు లబ్ధిదారులందరూ ఎన్పీసీఐ లింకేజీ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి అంటూ తెలిపారు. తల్లికి వందనం పథకానికి అర్హులైన వాళ్ళందరూ తమ తమ బ్యాంకు ఖాతాలకు ఆధారం లింక్ చేసుకోవాలి. అలాగే రైతులందరూ అన్నదాత సుఖీభవ పథకానికి ఆధార్ కార్డు బ్యాంకు ఖాతాకు అనుసంధానం తప్పకుండా చేసుకోవాలి.
వెబ్ ల్యాండ్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలి అంటూ అధికారులు చెప్తున్నారు. న్యాయపరంగా రైతు వాస్తవ లబ్ధిదారుడిగా ఉండాలి అంటూ ఆదేశించారు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి కూడా వెబ్ ల్యాండ్ లో పేరు లేని వారు వెంటనే నమోదు చేసుకోవాలి అంటూ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆధార అనుసంధానం చాలా అవసరం. ఈ పథకాల కింద నగదు బదిలీ కోసం ఆధారం బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేయడం తప్పనిసరి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనము మరియు అన్నదాత సుఖీభవము వంటి పథకాల కింద అర్హులైన వాళ్లందరికీ వారి బ్యాంకు ఖాతాలో నేరుగా డబ్బులను జమ చేస్తారు. ఈ క్రమంలో లబ్ధిదారులందరూ ఎన్పీసీఐ మేపర్ లో బ్యాంకు ఖాతాను ఆధార్కు మ్యాపింగ్ తప్పనిసరిగా చేయాలి. లబ్ధిదారులందరికీ ఈ ప్రక్రియను సులభంగా చేయడానికి పోస్ట్ ఆఫీస్ తో పాటు సచివాలయ యంత్రాంగం మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చేనెల జూన్ 5వ తేదీలోగా లబ్ధిదారులందరికీ ఆధార్ సీడింగ్ తో పాటు ఎంపీసీఐ లింకేజ్ పూర్తి చేస్తారు.