Best Actor For Allu Arjun: ప్రతిభ ని నమ్ముకొని ముందుకు వెళ్లేవారికి ఎన్ని అవరోధాలు ఎదురైనా ముందుకు దూసుకెళ్లగలరు అనేందుకు నిదర్శనం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun). టాలెంట్ కి పర్యాయపదం లాంటి హీరో, మన తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు విస్తరింపజేసిన ఘనులలో ఒకరు అల్లు అర్జున్. అలాంటి ప్రతిభావంతుడికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సత్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు, అందుకు కారణం ఏదైనా అయ్యుండొచ్చు. అయితే ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ప్రతిభ ని గుర్తించింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘గద్దర్ అవార్డ్స్'(Gaddar Awards) లో అల్లు అర్జున్ ని ఉత్తమ నటుడు క్యాటగిరీకి ఎంపిక చేశారు. గత ఏడాది పుష్ప 2 చిత్రం తో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ సృష్టించిన సునామీ ఎలాంటిదో ప్రతికేయించి చెప్పనవసరం లేదు.
ఆ సినిమాలో అద్భుతంగా నటించినందుకు తెలంగాణ సర్కార్ అల్లు అర్జున్ ని ఉత్తమనటుడి క్యాటగిరీ కి ఎంపిక చేసింది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిన అంశం. మరోపక్క అల్లు అర్జున్ ని ఆయన అభిమానులు పొగడ్తలతో ముంచి ఎత్తుతున్నారు. నిన్ను ఎన్నో కారణాల చేత ఎవరైనా ఇబ్బంది పెట్టొచ్చు, కానీ ప్రతిభ విషయం లో మాత్రం నీకు శత్రువులు సైతం సలాం కొట్టాల్సిందే అంటూ ఎలివేషన్స్ వేస్తున్నారు ఫ్యాన్స్. గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైన అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో సమయంలో సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట ఘటన లో తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడే అదే తెలంగాణ ప్రభుత్వం ఆయనకు సత్కరించబోతుంది అంటూ అభిమానులు ఎలివేషన్స్ వేస్తున్నారు. ఈ అంశం పై మరోవైపు రేవంత్ రెడ్డి పై కూడా ప్రశంసల వర్షం కురుస్తుంది.
సీఎం రేవంత్ రెడ్డి కి అల్లు అర్జున్ పై కోపం ఇప్పటికీ ఉండి ఉండొచ్చేమో, కానీ ఆయన కోపాన్ని ప్రతిభ విషయం లో వివక్ష చూపించలేదు. ఇది ఎంతో మెచ్చుకోదగ్గ అంశమని నెటిజెన్స్ కొనియాడుతున్నారు. అయితే అల్లు అర్జున్ ఈ అవార్డు స్వీకరిస్తాడా లేడా?, అవార్డ్స్ ఫంక్షన్ కి వస్తాడా?, లేకపోతే ఆయనకు బదులుగా తన తండ్రి అల్లు అరవింద్ ని పంపిస్తాడా?, అసలు ఏమి జరగబోతుంది అనేది పాతుతానికి సస్పెన్స్. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ కలిసి ఒకే వేదిక పై కనిపిస్తే ఇరువురి అభిమానులకు కనుల పండుగ లాగా ఉంటుంది. కానీ అసెంబ్లీ సాక్షిగా తన క్యారక్టర్ గురించి ముఖ్యమంత్రి చెడుగా మాట్లాడడం తో అల్లు అర్జున్ పై ఎన్నో వ్యాఖ్యలు చేసాడు. దీనికి అల్లు అర్జున్ కూడా ఎంతో బాధపడ్డాడు, ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఈ ఈవెంట్ కి వస్తాడో లేదో చూడాలి.