Talliki Vandanam Welfare Schemes
Thalliki Vandanam : పథకాల అమలుపై ఫుల్ ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం( Alliance government ). ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. అయితే అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. దీంతో ఒక రకమైన చర్చ అయితే జరుగుతోంది. సంక్షేమ పథకాల అమలు ఎప్పుడు అని ప్రతిపక్షాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కీలకమైన రెండు పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా విద్యార్థుల చదువుకు సంబంధించి తల్లికి వందనం అమలు చేయాలని చూస్తోంది. ఈ నెల 24 నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు ఇవ్వనున్నారు. జూన్ 12న తిరిగి పాఠశాలలు తెరవనున్నాయి. ఇంతలోనే తల్లికి వందనం పథకం అమలు చేయాలని భావిస్తున్నారు సీఎం చంద్రబాబు. మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో పడ్డారు విద్యాశాఖ అధికారులు.
Also Read : రాజకీయాల్లోకి ఆ మాజీ ఐపీఎస్ అధికారి!
* మార్గదర్శకాలకు కసరత్తు..
తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది చదువుకు సాయం అందిస్తామని చంద్రబాబు( Chandrababu) హామీ ఇచ్చారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రూ.15000 చొప్పున అందిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అధికారులు ఆ మార్గదర్శకాలను ఖరారు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అర్హుల ఖరారు విషయంలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారు. దాదాపు నిబంధనలు ఖరారు అయినట్లు చెబుతున్నారు. ఈ నెల 15న ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. అందులో తల్లికి వందనంపై తుది నిర్ణయం తీసుకున్నారు.
* ఆ రెండు పథకాలు అమలు చేస్తే..
తల్లికి వందనంతో( thalliki Vandanam) పాటు అన్నదాత సుఖీభవ పథకం విషయంలో కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ రెండు పథకాలు అమలు చేస్తే ప్రజల్లో ఒక రకమైన సంతృప్తి పెరుగుతుందని అంచనా వేస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. ఈ విషయంలో ఇటీవల చంద్రబాబు సైతం కీలక ప్రకటన చేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మాదిరిగా ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అంతమంది చదువుకు సాయం చేస్తామని కూడా చెప్పుకొచ్చారు. తల్లికి వందనం కోసం బడ్జెట్లో రూ.9407 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వం కేటాయించిన నగదు కంటే ఇది అధికమని కూటమినేతలు చెబుతున్నారు.
* వారంతా అనర్హులు..
అయితే ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంవత్సరం( academic year ) ప్రారంభం నాటికి ప్రతి తల్లి ఖాతాలో నగదు జమ చేస్తామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే పథకం అమలు కోసం అధికార యంత్రాంగం మార్గదర్శకాలు తయారు చేసే పనిలో ఉంది. త్వరలోనే వీటిని అధికారికంగా ఖరారు చేయనున్నారు. విధి విధానాలపై అధ్యయనం కొనసాగుతోంది. గతంలో వైసిపి ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను సమీక్షిస్తున్నారు. ఆదాయ పన్ను చెల్లింపు దారులు, తెల్ల రేషన్ కార్డు లేని వారిని, 300 యూనిట్లు కంటే అధికంగా విద్యుత్ వినియోగించే వారిని పథకానికి అనర్హులుగా పరిగణించే అవకాశం ఉంది. అయితే గతంలో ఈ విధానాలను టిడిపి తో పాటు జనసేన వ్యతిరేకించింది. అందుకే వీరికి సైతం సాయం అందించేందుకు సిద్ధపడుతుందని ప్రచారం సాగుతోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read : అమరావతికి 44 వేల ఎకరాలు.. చంద్రబాబు ప్లాన్ అదే!
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Thalliki vandanam ap governments big update on the thalliki vandanam scheme
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com