Mahasena Rajesh: సోషల్ మీడియా లో నెటిజెన్స్ ని అత్యంత ప్రభావితం చేసే యూట్యూబర్స్ లో ఒకరు రాజేష్ మహాసేన. ఈయనకి ఉన్నటువంటి ఫాలోయింగ్ మామూలుది కాదు. వివిధ అంశాలపై విశ్లేషిస్తూ ఆయన చేసే వీడియోస్ కి విపరీతమైన వ్యూస్ వస్తుంటాయి. మొదట్లో ఈయన వైసీపీ పార్టీ కి సపోర్టుగా ఎక్కువ వీడియోలు చేసేవాడు. ఆ తర్వాత పార్టీ నుండి బయటకి వచ్చి జనసేన పార్టీ లో చేరేందుకు మొగ్గు చూపించాడు. కానీ వైసీపీ లో ఉన్నప్పుడు ఈయన జనసేన పార్టీ పై, పవన్ కళ్యాణ్ అభిమానులపై అత్యంత నీచమైన కామెంట్స్ చేయడం , వాటికి సంబంధించిన వీడియోలు పవన్ కళ్యాణ్ వరకు చేరడంతో ఆయన పార్టీ లోకి తీసుకోలేదు. కొన్నాళ్ల తర్వాత టీడీపీ లో చేరాడు. తెలుగు దేశం పార్టీ ఈయన్ని గుర్తించి, పీ. గన్నవరం లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చింది. కానీ స్వగ్రామం నుండి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఆ టికెట్ ని వదులుకోవాల్సి వచ్చింది.
అయితే రాజేష్ మహాసేన ఎన్నికలకు మరికొద్దిరోజుల సమయం ఉన్నప్పుడు కూటమి లో ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. పవన్ కళ్యాణ్ ని, అదే విధంగా జనసేన పార్టీ పోటీ చేస్తున్న అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీ ని ఓడిపోయేలా చేసేందుకు తమ వంతు కృషి చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మోడీని పవన్ కళ్యాణ్ మరీ ఆకాశానికి ఎత్తేస్తున్నాడు, కూటమి ఇతని వల్ల కచ్చితంగా ఓడిపోతుంది అంటూ ఒక సంచలన వీడియో చేశాడు. దీనిపై అప్పట్లో జనసనికులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత వారం రోజులుగా సోషల్ మీడియా లో నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం ని చేయాలంటూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు తీవ్రస్థాయిలో డిమాండ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మీడియా చానెల్స్ లో కూడా ఈ విషయంపై లైవ్ డిబేట్స్ జరిగాయి. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో స్పందించి మా నాయకుడిని ముఖ్య మంత్రి చేయాలంటూ డిమాండ్ చేశారు.
ఇలా ఇరు పక్షాన మధ్య పెద్ద గందరగోళం వాతావరణం నెలకొంది. అలాంటి గందరగోళం వాతావరణకి తెరలేపిన కీలక వ్యక్తులలో ఒకరు రాజేష్ మహాసేన. ముందుగా ABN ఆర్కే ఈ అంశం పై మాట్లాడడం, దానికి కొనసాగింపుగా రాజేష్ మహాసేన స్పెషల్ వీడియో చేసి నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్ చేయడంతో తెలుగు దేశం పార్టీ క్యాడర్ కూడా ఈ అంశం పై తమ గళం వినిపిస్తూ సపోర్టు చేసింది. వాటికి టీడీపీ ఎమ్మెల్యేలు కూడా స్పందించి మద్దతు తెలిపారు. కూటమి అభిమానుల మధ్య చిచ్చు లేపుతున్న ఈ అంశాన్ని గమనించిన టీడీపీ అధిష్టానం వెంటనే ఈ చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా ఈ వివాదాలకు ఆజ్యం పోసిన రాజేష్ మహాసేనపై కూడా అధిష్టానం ఫైర్ మీద ఉన్నట్టు తెలుస్తుంది. ఏ క్షణంలో అయిన అతను సస్పెండ్ అవ్వొచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏమి జరగబోతుందో చూడాలి.