Meenakshi Chaudhary: నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తున్న మీనాక్షి చౌదరి, అప్పుడే స్టార్ హీరోయిన్ల రేసులోకి దూసుకొచ్చేసింది. మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి, స్టార్ హీరోల వరకు ఇప్పుడు ప్రతీ ఒక్కరు మీనాక్షి చౌదరి ని తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు. మొదట్లో ఎక్కువ శాతం ఫ్లాప్ సినిమాలే ఎదురయ్యాయి, కానీ గత ఏడాది చివర్లో వచ్చిన ‘లక్కీ భాస్కర్’, ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కమర్షియల్ గా ఎలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మొదటి వారం లోనే వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను సాధించి, 200 కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి కూడా చేరింది. ‘లక్కీ భాస్కర్’ చిత్రం సూపర్ హిట్ అయినప్పటికీ మీనాక్షి చౌదరి కి పెద్దగా పేరేమి రాలేదు. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కి మాత్రం మంచి పేరొచ్చింది.
మీనాక్షి చౌదరి ఇంత బాగా యాక్టింగ్ చేస్తుందని అనుకోలేదంటూ సోషల్ మీడియా లో ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా విడుదలకు ముందు ఈమె ప్రొమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూ లో యాంకర్ పవన్ కళ్యాణ్ గురించి అడిగిన ఒక ప్రశ్న కి ఈమె చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ముందుగా యాంకర్ మాట్లాడుతూ ‘పవన్ కళ్యాణ్ గారి బయోపిక్ ని మీరు రాస్తే ఏమని టైటిల్ పెడుతారు’ అని అడగగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘ది గ్లాస్ ఈజ్ అల్వేస్ హాఫ్ ఫుల్’ అని పెడతాను అంటూ చెప్పుకొచ్చింది. దానికి ఆమె వివరణ ఇస్తూ ‘ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పార్టీ గుర్తు గ్లాస్ కదా, అందుకే అది టైటిల్ లో పెట్టాను.. ఆయనది చాలా పాజిటివ్ యాటిట్యూడ్’.
‘ఆయన పొలిటికల్ జర్నీ ప్రతీ ఒక్కరికి ఆదర్శప్రాయకం. ఎన్నో కష్టాలు, అవమానాలు పడి నేడు ఈ స్థానం లో నిల్చున్నాడు కదా. ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు నిరాశ చెందకుండా, నెవెర్ గివ్ అప్ అనే యాటిట్యూడ్ తో ముందుకు పోతే కచ్చితంగా విజయం సాధించగలం అని అనడానికి ఆయన ఒక నిదర్శనం’ అంటూ చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. తమ అభిమాన హీరో గురించి ఇంత గొప్పగా మాట్లాడినందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు మీనాక్షి చౌదరి కి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నారు. ఇకపోతే మీనాక్షి చౌదరి ప్రస్తుతం నవీన్ పోలిశెట్టి హీరో గా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శ్రీలీల ని తీసుకున్నారు. ఆ తర్వాత ఆమెని తప్పించి మీనాక్షి చౌదరి ని ఎంచుకున్నారు.
If @Meenakshiioffl writes @PawanKalyan‘s biopic title is “ The Glass is Always Half Full ”#SankranthikiVasthunam#PawanKalyanpic.twitter.com/evyCDHScxP
— Milagro Movies (@MilagroMovies) January 21, 2025