TDP Second List: టీడీపీ రెండో జాబితా.. కీలక సీట్లు వీరికే

జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు సర్దుబాటు చేశారు. టిడిపి మిగతా 144 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయనుంది.

Written By: Dharma, Updated On : March 14, 2024 1:51 pm

TDP Second List

Follow us on

TDP Second List: తెలుగుదేశం పార్టీ రెండో జాబితాని విడుదల చేసింది. 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బిజెపికి పది అసెంబ్లీ స్థానాలు,ఆరు పార్లమెంట్ స్థానాలు కేటాయించారు.జనసేనకు 21 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలు సర్దుబాటు చేశారు. టిడిపి మిగతా 144 అసెంబ్లీ స్థానాలతో పాటు 17 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయనుంది. అందులో భాగంగా తొలి జాబితాలో 94 అసెంబ్లీ స్థానాలు, ఇప్పుడు రెండో జాబితాలో 34 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ఖరారు చేశారు.ఇంకా 16 స్థానాలు మాత్రమే పెండింగ్లో పెట్టారు.తుది జాబితాలో ఆ 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఒకసారి ఖరారైన అభ్యర్థుల పేర్లను పరిశీలిద్దాం.

నరసన్నపేట బగ్గు రమణమూర్తి,గాజువాక పల్లా శ్రీనివాసరావు, చోడవరం కెఎస్ఎన్ఎస్ రాజు, మాడుగుల పైలా ప్రసాద్, ప్రత్తిపాడు వరుపుల సత్యప్రభ, రామచంద్రపురం వాసంశెట్టి సుభాష్, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రంపచోడవరం మిరియాల శిరీష, కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు, దెందులూరు చింతమనేని ప్రభాకర్, గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, పెదకూరపాడు భాష్యం ప్రవీణ్,గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, గుంటూరు ఈస్ట్ మహమ్మద్ నజీర్, గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు, కందుకూరు ఇంటూరి నాగేశ్వరరావు, మార్కాపురం కందుల నారాయణరెడ్డి, గిద్దలూరు అశోక్ రెడ్డి, ఆత్మకూరు ఆనం రామనారాయణరెడ్డి, కోవూరు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, వెంకటగిరి కొరుగొండ్ల లక్ష్మీప్రియ, కమలాపురం కొత్త చైతన్య రెడ్డి, ప్రొద్దుటూరు వరదరాజుల రెడ్డి, నందికొట్కూరు గిత్త జయసూర్య, ఎమ్మిగనూరు జయ నాగేశ్వరరెడ్డి, మంత్రాలయం రాఘవేంద్ర రెడ్డి, పుట్టపర్తి పల్లె సింధూర రెడ్డి, కదిరి కందికుంట యశోదా దేవి, మదనపల్లి షాజహాన్ బాషా,పుంగనూరు చల్లా రామచంద్రారెడ్డి, చంద్రగిరి పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని), శ్రీకాళహస్తి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, సత్యవేడు కోనేటి ఆదిమూలం, పూతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్ టిడిపి అభ్యర్థులుగా ఖరారు అయ్యారు.