TDP Party : ఎవర్ని ఎప్పుడు ఎలా వాడాలో చంద్రబాబుకు( Chandrababu) తెలుసు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక బట్టి ఆయన మార్పు ఇట్టే తెలిసిపోతుంది. కనీసం అభ్యర్థుల ఎంపిక విషయంలో చిన్న లీకు కూడా బయటకు రాలేదు. అభ్యర్థులు ప్రకటించే వరకు పార్టీలో సైతం ఎవరికి తెలియదు. అనూహ్యంగా కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర, బీటీ నాయుడు పేర్లను చంద్రబాబు ఖరారు చేశారు. వీరి ప్రకటన తరువాత పార్టీలో అసంతృప్తులు పెరుగుతాయని అంచనాకు వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనినే ఆశించింది. ముఖ్యంగా పిఠాపురం వర్మ, వంగవీటి రాధాకృష్ణ, దేవినేని ఉమామహేశ్వరరావు, దువ్వారపు రామారావు, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు అసంతృప్త స్వరం వినిపిస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ ఆ అంచనాలను తారుమారు చేస్తూ టిడిపి నాయకులు చాలా సైలెంట్ గా వ్యవహరించారు.
Also Read : వైసీపీ లాగే టిడిపి ప్రభుత్వం.. అధికారుల కోసం నేతలు దూరం!
* సామాజిక సమతూకం
సామాజిక సమతూకంలో భాగంగా ఇద్దరు బీసీలకు( backward caste ) చాన్స్ ఇచ్చారు చంద్రబాబు. అదే సమయంలో ఒక మహిళ, ఆపై ఎస్సీ సామాజిక వర్గం, సీనియర్ నేత కుమార్తె వంటివి పరిగణలోకి తీసుకొని గ్రీష్మకు ఛాన్స్ ఇచ్చారు. అయితే అంతకంటే ముందే ఎవరెవరైతే ఎమ్మెల్సీ పదవులు ఆశించారో వారికి సమాచారం పంపినట్లు తెలుస్తోంది. ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని.. వారిని ఎప్పుడు పదవులు కట్టబెడతారో వారికే నేరుగా చెప్పినట్లు సమాచారం. భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా పెండింగ్ లో పెట్టామే కానీ.. మీ సేవలు పక్కా అని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం.
* 2028 కి తగ్గనున్న వైసీపీ బలం
ప్రస్తుతం శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి మెజారిటీ ఉంది. 2028 నాటికి ఆ పార్టీ బలం పూర్తిగా తగ్గిపోతుంది. మండలి చైర్మన్ గా ఉన్న మోసేన్ రాజు పదవీకాలం సైతం ముగుస్తుంది. అదే సమయానికి టిడిపి కీలక నేతలందరికీ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చేందుకు చంద్రబాబు ప్లాన్ చేసినట్లు సమాచారం. 2028 నాటికి పూర్తిస్థాయిలో టిడిపి నేతలు అందరికీ పదవులు ఇస్తామని.. అదే టీం తో 2029 ఎన్నికలకు వెళ్తామని చంద్రబాబు వారికి హామీ ఇచ్చారు. 2027 లోనే చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల పదవులు ముగుస్తాయి. మరోవైపు 2026 మార్చిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. అవి పూర్తయితే స్థానిక సంస్థల కోటా కింద టిడిపి నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తామని కూడా చంద్రబాబు హామీ ఇచ్చినట్లు సమాచారం.
* చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించిన వర్మ..
అయితే ఎమ్మెల్సీల ఎంపిక విషయంలో తెలుగుదేశం( Telugu Desam) పార్టీలో విభేదాలు వస్తాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. కానీ తెలుగుదేశంలో ఎక్కడ అసంతృప్త స్వరాలు బయటపడలేదు. వర్మ అయితే చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించారు. రాష్ట్రస్థాయిలో ఎన్నెన్నో సమీకరణలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని.. అందుకే చంద్రబాబు తనను ఎంపిక చేయలేకపోయారని చెప్పుకొచ్చారు వర్మ. అయితే ఇప్పటికే చంద్రబాబు ఆశావహులతో మాట్లాడడంతోనే.. వారంతా బయట మాట్లాడకుండా సైలెంట్ పాటించినట్లు తెలుస్తోంది.
Also Read : బొమ్మల పిచ్చితో దేన్నీ వదల్లే.. జగన్ పై లోకేష్ సంచలన కామెంట్స్!