ABN RK And Chandrababu: సాక్షిలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వార్తను ఊహించగలమా? కనీసం సింగిల్ లైన్ వార్త పబ్లిష్ అవుతుందని భావించగలమా? ఈనాడులో జగన్ అనుకూల వార్తలను మనం అంచనా వేయగలమా? ఇదే సందర్భంలో ఆంధ్రజ్యోతిలో కూడా జగన్ అనుకూల వార్తలు కనిపిస్తే చూసే అవకాశం మనకుంటుందా?
ఈ ప్రశ్నలకు లేదు, కాదు, సాధ్యం అవదు అనే సమాధానాలు వస్తాయి. ఎందుకంటే ఆయా మీడియా సంస్థలు.. ఆయా వ్యక్తులకు మౌత్ పీసులుగా మారిపోయాయి కాబట్టి. మీడియా న్యూట్రల్ గా ఉండాలి.. నిష్పక్షపాతంగా వార్తలను ప్రచురించాలి.. ప్రసారం చేయాలి అనే కొల బద్దలు ఇక్కడ పనిచేయవు. ఎందుకంటే ఆయా మీడియా సంస్థలు వ్యక్తుల కోసం.. వ్యక్తులు ఏర్పాటు చేసిన వ్యక్తి స్వామ్యాల కోసం పనిచేస్తున్నాయి కాబట్టి.. వాటికంటూ బలమైన లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి.. ఆ లక్ష్యాల కోసం ఏదైనా చేస్తాయి కాబట్టి.. వాటి దగ్గర నుంచి నిష్పక్షపాతను ఆశించడం నేతిబీర సామెత అవుతుంది.
అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ.. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై నిలదీస్తూ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఏబీఎన్ లో కథనాలు ప్రసారమవుతున్నాయి. వాస్తవానికి ఇది ఆశ్చర్యం కలిగించే పరిణామం అయినప్పటికీ ఎందుకనో ఏబీఎన్ లో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు ప్రసారమవుతున్నాయి. ముఖ్యంగా సూపర్ 6 పథకాల అమలు సక్రమంగా లేదని.. యువగళం పాద యాత్ర సమయంలో నారా లోకేష్ ప్రజలకు ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేయలేదని.. ప్రజల్లో ఒకింత ఆగ్రహం కలుగుతోందని.. ఏడాది పాటు సాగిన పరిపాలనలో ప్రజలకు కొంత మాత్రమే మోదం కలిగిందని.. చాలా సందర్భాలలో ఖేదమే వినిపిస్తోందని ఏబీఎన్ తన కథనాలలో ప్రసారం చేసింది.
ఇటీవారి కాలంలో వేమూరి రాధాకృష్ణ జిల్లాలలో పర్యటించారు. చాలా కాలం తర్వాత ఆయన జిల్లాలలో పర్యటించడం ఒక రకంగా ఆంధ్రజ్యోతి ఉద్యోగులలో సందడి వాతావరణం నెలకొంది. ఉద్యోగులతో నిర్వహిస్తున్న సమావేశం సందర్భంగా రాధాకృష్ణ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే.. ఖచ్చితమైన ఆధారాలు ఉంటే కథనాలను ప్రసారం చేయండి.. వార్తలను రాయండి అంటూ కిందిస్థాయి ఉద్యోగులకు సూచనలు చేశారు. దీంతో వారు రాధాకృష్ణ ఆదేశాలను పాటిస్తున్నట్టు తెలుస్తోంది. గతానికంటే భిన్నంగా ఈసారి ఆంధ్రజ్యోతిలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు వ్యతిరేకంగా కథనాలు ప్రచురితం కావడం విశేషం..ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రుల మీద ఆంధ్రజ్యోతిలో వ్యతిరేకంగా కథనాలు రావడం విశేషం. అయితే వీటిని వైసిపి ప్రముఖంగా సోషల్ మీడియాలో పేర్కొనడం గమనార్హం.. అయితే రాధాకృష్ణ కూటమి ప్రభుత్వంపై ఇలా ఎందుకు వ్యతిరేక వార్తలు రాస్తున్నారు.. ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ వ్యవహార శైలిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు.. ఈ ప్రశ్నల పరంపర రాధాకృష్ణ ఎందుకు సంధిస్తున్నారు.. ఉన్నట్టుండి ఒకేసారి రూటు ఎందుకు మార్చారు.. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాల్సి ఉంది.
ఏబీఎన్ రాధాకృష్ణ కు ఏమయ్యింది??
బాబుగారికి వెన్నుపోటా????
Unexpected!!! pic.twitter.com/poSR4JswQk— Samosa Times (@Samotimes2026) June 12, 2025