Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నేడు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం లో పర్యటించాడు. ఏళ్ల తరబడి నీటి సమస్యలు ఉన్న ప్రకాశం జిల్లాలో 1290 కోట్ల రూపాయిల విలువ చేసే త్రాగునీటి పధకానికి ఆయన శంకుస్థాపన చేసాడు. ఈ కార్యక్రమానికి టీడీపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అభిమానులు కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆయన మాట్లాడుతూ గతం లో తమ కుటుంబం కనిగిరి లోనే ఉండేదని, కానీ ఇక్కడ ఫ్లోరైడ్స్ కారణంగా నీరు కలుషితం అవ్వడంతో మేము ఇక్కడ ఆరు మాసాలకు మించి ఉండలేకపోయాము అంటూ చెప్పుకొచ్చాడు. కనిగిరి లో ఫ్లోరైడ్స్ సమస్య కారణంగా ఎంతో మంది అనారోగ్యానికి గురయ్యారని, ఈ సమస్య ఎప్పటి నుండో నా దృష్టిలో ఉందని చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ప్రకాశం జిల్లా వాసుల నీటి కష్టాల గురించి నాకు పూర్తి అవగాహన ఉంది. చిన్నతనం లో మా కుటుంబం ఇక్కడ కొన్ని నెలలు నివాసం ఉండేది. కానీ ఫ్లోరైడ్ నీళ్ల కారణంగా మేము కేవలం ఆరు నెలల్లోనే ఈ ప్రాంతాన్ని వదిలి వేరే చోటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. గతంలో నాలుగు వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేసి, ప్రాజెక్ట్ ని మొదలు పెట్టి , వైసీపీ పార్టీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. నేడు మేము ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా పశ్చిమ ప్రాంతం లో జనాలకు సురక్షిత నీరు అందుతుంది’ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. అదే విధంగా ఇదే మీటింగ్ లో ఆయన వైసీపీ పార్టీ పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రీసెంట్ గా వైసీపీ నాయకులూ వరుసగా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వాళ్లకు వార్నింగ్ ఇస్తూ చాలా పవర్ ఫుల్ వ్యాఖ్యలు చేశాడు.
అయితే నేడు ప్రారంభించిన ఈ ప్రాజెక్ట్ ద్వారా పశ్చిమ ప్రాంతం లో ఉన్న 31 మండలాల్లో 1387 గ్రామాలకు స్వచ్ఛమైన మంచి నీళ్లు దొరుకుతాయట. దశాబ్దాల నుండి నీటి సమస్య తో ఇబ్బంది పడుతున్న వేలాది మంది జనాలకు ఈ ప్రాజెక్ట్ ఉపశమనం కలిగించింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడం, ఆయన వెంటనే స్పందించడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో చర్చించి ఈ ప్రాజెక్ట్ ని తీసుకొని రావడం వంటివి జరిగింది. రీసెంట్ గానే గ్రామాల్లో లక్షకు పైగా ఫార్మ్ పాండ్స్ ని తవ్వించి చరిత్ర సృష్టించిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఈ అద్భుతమైన కార్యక్రమం తో మరోసారి వార్తల్లో నిలిచాడు.