MP Vemareddy Prabhakar Reddy: ఏపీలో( Andhra Pradesh) ఆసక్తికర రాజకీయాలు నడుస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అవుతోంది. పాలనతో పాటు సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టింది. ఇంకో వైపు జగన్ ప్రజల్లోకి వచ్చేందుకు డిసైడ్ అయ్యారు. విదేశాల నుంచి వచ్చిన వెంటనే జిల్లాల పర్యటనకు రానున్నారు. ఇటువంటి తరుణంలో పొలిటికల్ హీట్ నెలకొంది. అయితే తాజాగా ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి. ఎన్టీఆర్ సేవలను గుర్తు చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు రకరకాలుగా కార్యక్రమాలు చేపట్టాయి. సీఎం చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. మరోవైపు టిడిపి నేతలు ఎన్టీఆర్ ఫోటోలతో కూడిన భారీ యాడ్ లను పత్రికలకు ఇచ్చారు. ఈ క్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ( vemareddy Prabhakar Reddy) సాక్షికి ఇచ్చిన యాడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫుల్ పేజీ యాడ్ తో ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు, లోకేష్ భారీ ఫోటోలతో.. పైన టిడిపి అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, నందమూరి బాలకృష్ణ ఫోటోతో కూడిన యాడ్ ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య ప్రశాంతి రెడ్డి పేరుతో ఇచ్చారు.
* ఇదే హాట్ టాపిక్
అయితే సాక్షిలో తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) యాడ్ ఏమిటన్నది ఇప్పుడు చర్చకు దారితీసింది. పొలిటికల్ సర్కిల్ చర్చ అయితే నడుస్తోంది. అటు వైసీపీ శ్రేణులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఇటు టిడిపి శ్రేణులు సైతం ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి. సాధారణంగా సాక్షిలో తెలుగుదేశం పార్టీ యాడ్స్ రావడం అరుదు. అందునా ప్రైవేట్ యాడ్ అనేది రావడం కాస్త ఆశ్చర్యకరమే. పైగా ఫుల్ పేజీ యాడ్ రావడం వెనుక ఏంటి కథ అన్న చర్చ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీ వైసీపీకి చెందిన మీడియాకు యాడ్ ఇవ్వడం ఏంటనేది ఇప్పుడు సందేహం. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటికి మొన్న ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకుముందు వైసీపీలో కీలక నేతల్లో ఒకరు. ఆయన యాడ్ ఇచ్చేసరికి ఇప్పుడు రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* అప్పట్లో సాక్షికి ప్రకటనలు
2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో ప్రధాన మీడియాతో సమానంగా సాక్షికి( Sakshi media) యాడ్ల రూపంలో అవకాశం ఇచ్చింది అప్పటి చంద్రబాబు సర్కార్. కానీ 2019 ఎన్నికలు తరువాత వైసిపి అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో టిడిపి అనుకూల మీడియాకు చుక్కలు చూపించింది. సాక్షికి సింహ భాగంలో యాడ్లు ఇచ్చి.. టిడిపి అనుకూల మీడియాకు మొండి చేయి చూపింది. అందుకే ఈసారి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షికి యాడ్లు ఇవ్వకూడదని ప్రభుత్వం భావించింది. అందుకే ఇప్పుడు ప్రభుత్వ ప్రకటనలు సాక్షిలో పెద్దగా కనిపించడం లేదు. అయితే సరిగ్గా ఇదే సమయంలో టిడిపికి చెందిన ఎంపీ భారీ యాడ్స్ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అందులో మైనస్ వెతకడం కంటే ప్లస్ పాయింట్లో చూడడం ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు సైతం సూచిస్తున్నారు. పైగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో అవమాన పడి తెలుగుదేశం పార్టీలో చేరారు. అటువంటి వ్యక్తి వైసీపీ పై, వైసిపి నాయకత్వం పై రివేంజ్ తీర్చుకునేందుకే ఈ యాడ్ ఇచ్చి ఉంటారన్నది ఒక అభిప్రాయము. ఒక రకమైన విశ్లేషణ.
* టిడిపిలో అత్యంత గౌరవం
అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి( VeMeri Prabhakar Reddy ) యాడ్ ఇచ్చారు సరే. కానీ సాక్షి యాజమాన్యం దానిని ప్రచురించడం విశేషం. ఎందుకంటే అది ప్రైవేటు యాడ్. పైగా తమ ప్రత్యర్థీ పార్టీని హైలెట్ చేస్తూ నిలిచే ప్రకటన అది. దానిని ప్రచురణ చేయకుండా చేసే అధికారం ఆ యాజమాన్యానికి ఉంది. కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ ప్రకటన ఇవ్వడం… సాక్షిలో ప్రచురించడం వెనుక వ్యూహం ఏదైనా ఉందా అన్న అనుమానాలు ఉన్నాయి. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి టిడిపిలో మంచి ప్రాధాన్యం దక్కుతోంది. ఆయన ప్రస్తుతం ఎంపీగా ఉండడంతో పాటు స్టాండింగ్ కమిటీల్లో సభ్యుడు కూడా. ఆయన భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కూడా. అందుకే ఈ విషయంలో వేరే ఆలోచనకు తావు లేదని.. కేవలం తన గౌరవాన్ని చాటి చెప్పుకునేందుకు వేమిరెడ్డి సాక్షికి యాడ్ ఇచ్చి ఉంటారని తెలుస్తోంది. మరి లోగుట్టు ఆయనకే తెలియాలి.