TDP MLC BT Naidu : ఇటీవల ఎన్నికైన ఎమ్మెల్సీల( elected MLC ) ప్రమాణ స్వీకార వేడుకలు కోలాహలంగా జరిగాయి. ఎమ్మెల్యేల కోటా తో పాటు గ్రాడ్యుయేషన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఐదుగురుతో శాసనమండలి చైర్మన్ ప్రమాణం చేయించారు. అయితే ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగిన అసెంబ్లీ ఆవరణలో దొంగలు చేతివాటం ప్రదర్శించారు. జేబు దొంగలు రెచ్చిపోయారు. ఓ ఎమ్మెల్సీ తో పాటు ఆయన గన్మెన్, లాయరు, మరో వ్యక్తి వద్ద ఉన్న పర్సులను దొంగలించి షాక్కుకు గురి చేశారు. కొణిదల నాగబాబు, సోము వీర్రాజు, బీటీ నాయుడు, పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగానే కొందరు డబ్బులు పోగొట్టుకున్నారు.
Also Read : అమరావతికి గ్రాండ్ ఎంట్రీ.. ఏపీ ప్రభుత్వ సరికొత్త ఆలోచన!
* నాలుగు లక్షల రూపాయల చోరీ..
మొత్తం నాలుగు లక్షల కు పైగా చోరీ జరిగినట్లు తెలుస్తోంది. టిడిపి ఎమ్మెల్సీ బీటీ నాయుడు( TDP MLC BT Naidu ) దగ్గర పదివేల రూపాయలు, ఆయన గన్ మెన్ దగ్గర రూ.40,000, ఆయనతో వచ్చిన లాయర్ దగ్గర 50 వేల రూపాయలు, మరొకరి దగ్గర 32 వేల రూపాయలు చోరీకి గురయ్యాయని తెలుస్తోంది. మరికొందరు దగ్గర సైతం కొద్ది మొత్తంలో నగదు చోరీకి గురైనట్లు సమాచారం. మొత్తంగా ఓ నాలుగు లక్షల రూపాయలకు దొంగలు టెండర్ పెట్టారు. అసెంబ్లీ ఆవరణలో దొంగతనం జరగడం ఇదే తొలిసారి అని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.
* భారీగా తరలివచ్చిన శ్రేణులు
ఎమ్మెల్యేల కోటాలో ఎన్నికైన బిజెపికి చెందిన సోము వీర్రాజు( Somveer Raju ), జనసేనకు చెందిన నాగబాబు, టిడిపికి చెందిన బిటి నాయుడులు ప్రమాణం చేశారు. పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, రాజశేఖర్ల సైతం ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గుర్తించే పార్టీ అని.. అందుకు ఉదాహరణ తానేనని చెప్పుకొచ్చారు. మరోవైపు ఎమ్మెల్సీలకు మద్దతుగా అన్ని పార్టీల నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ క్రమంలోనే జేబు దొంగలు రెచ్చిపోయారు.
* సీఎంను కలిసిన నాగబాబు..
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన నాగబాబు( Nagababu ) తన భార్య పద్మజతో కలిసి సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. చంద్రబాబు నాగబాబును సాల్వతో సత్కరించి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించారు. అంతకుముందు చంద్రబాబును నాగబాబు దంపతులు సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు నాగబాబు ధన్యవాదాలు తెలిపారు. ఇద్దరు నేతల సూచనలకు అనుగుణంగా తన బాధ్యతలను నిబద్దతో నిర్వర్తిస్తానని చెప్పారు. అయితే తొలిసారిగా అసెంబ్లీ ఆవరణలో జేబు దొంగలు రెచ్చిపోవడం మాత్రం ఆందోళన కలిగించింది.