Chandrababu Naidu Warning: టిడిపి ఎమ్మెల్యేలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. చంద్రబాబు( CM Chandrababu) దిశా నిర్దేశం చేసిన చాలామంది తీరులో మార్పు రావడం లేదు. రోజుకు ఎమ్మెల్యే వివాదాస్పదం అవుతూనే ఉన్నారు. తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేయడంపై ప్రభుత్వ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. పరిస్థితి గాడి తప్పుతోందని సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ సైతం ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏపీ క్యాబినెట్ సమావేశంలో సైతం చంద్రబాబు దీనిపై సీరియస్ గా మాట్లాడినట్లు ప్రచారం సాగుతోంది. జిల్లా మంత్రులతోపాటు ఇన్చార్జ్ మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ఒక కన్నేసి ఉంచాలని ఆదేశించినట్లు సమాచారం. ముఖ్యంగా రౌడీ మాఫియా విస్తరిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. ఎక్కడికక్కడే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రమేయంతోనే టిడిపి ఎమ్మెల్యేలు వివాదాస్పదం అవుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: ఏపీలో ఒక్కో విద్యార్థికి రూ.లక్ష.. ఎలా అంటే?
ఆ స్నేహాలతోనే..
సాధారణంగా ప్రధాన నేతలు తప్పించి.. క్షేత్రస్థాయిలో ప్రత్యర్థి పార్టీల్లో పనిచేసే నేతలతో స్నేహాలు ఉంటాయి. ఇప్పుడు ఆ స్నేహాలే టిడిపి ఎమ్మెల్యేల వివాదాలకు కారణం అవుతున్నాయి. ఐదేళ్లపాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో( YSR Congress party ) చాలామంది ఎమ్మెల్యేలు వ్యాపారాల్లో ఆరితేరిపోయారు. వారి విషయంలో హైకమాండ్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇచ్చింది. అయితే ఇప్పుడు అదే నేతలు కొన్ని జిల్లాల్లో వ్యాపారాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే వారు టిడిపి ఎమ్మెల్యేలతో కలిసిపోయినట్లు తెలుస్తోంది. వ్యాపార భాగస్వామ్యం కల్పించడం ద్వారా తమపై రాజకీయ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు ఎమ్మెల్యేలు వైసీపీ నేతలతో చేతులు కలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మద్యం వ్యాపారంలో సైతం..
మద్యం షాపుల విషయంలో సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మద్యం టెండర్ల( liquor tenders ) విషయంలో తల దూర్చవద్దని కూడా హెచ్చరించారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడికక్కడే మద్యం షాపుల టెండర్లు దక్కించుకోవడం, సిండికేట్ కావడం వంటి విషయాల్లో ఎమ్మెల్యేల ప్రమేయం అధికంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో ట్విస్ట్ ఏంటంటే కొంతమంది వైసీపీ నేతలతో వ్యాపారం చేయిస్తోంది ఎమ్మెల్యే లేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుకతో పాటు మట్టి తవ్వకాల్లో సైతం తమ చేతికి మట్టి అంటకుండా, ఆరోపణలు రాకుండా వైసిపి నేతలతో కొందరు ఎమ్మెల్యేలు చేతులు కలిపారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే సొంత పార్టీలో నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. అవే ఎమ్మెల్యేలు వివాదాల్లో కూరుకుపోవడానికి కారణం అవుతున్నాయి.
Also Read: అక్టోబర్ లో రాజకీయ ప్రకంపనలు!
వివాదాలకు ఆజ్యం
సాధారణంగా అధికారులు, ఉద్యోగుల బదిలీల్లో( transfers ) రాజకీయ సిఫార్సులు ఉంటాయి. కానీ ఇక్కడ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సరికొత్త లాజిక్ ప్రదర్శిస్తోంది. టిడిపి నేతల మధ్య ఆధిపత్య పోరును సాకుగా తీసుకుంటోంది. ఒక అధికారిని అధికార పార్టీ నేతతోనే బదిలీ చేయిస్తుంటే.. మరో అధికార పార్టీ నాయకుడు అడ్డుకోవడంతో విభేదాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలో కూడా వివాదాలు నడుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఓ అధికార పార్టీ ఎమ్మెల్యే వివాదాల్లో చిక్కుకోవడానికి అదే కారణం. అయితే క్రమశిక్షణ విషయంలో సీఎం చంద్రబాబు చాలా రకాలుగా ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు కానీ… ఎంత మాత్రం ప్రభావం చూపడం లేదు. అందుకే ఇక్కడ నుంచి ఉదాసీన వైఖరి లేకుండా కఠినంగా వ్యవహరించడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. చూడాలి ఎలాంటి చర్యలకు దిగుతారో..