AP Public Health Department: ఏపీలో( Andhra Pradesh) వైద్య ఆరోగ్య శాఖ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. గత కొంతకాలంగా ఆ శాఖలో అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆపై పదోన్నతులు కూడా జరగలేదు. ఈ తరుణంలో ఒకవైపు పదోన్నతులు కల్పిస్తూనే.. కొత్త పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్యులతో పాటు అధికారులు కలిపి మొత్తం 223 మందికి ప్రమోషన్లు ఇవ్వాలని ఒక నిర్ణయానికి వచ్చింది. ఆయుష్ విభాగంలో అదనపు సంచాలకుల పోస్టుకు కూడా ఆమోదం తెలిపింది. ప్రజారోగ్య విభాగంలో డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతులు కల్పించింది. దీనికి సంబంధించిన శాఖా పరమైన పదోన్నతుల కమిటీ సిఫార్సులకు ఆమోదం తెలపాలని అధికారులను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం. ఖాళీగా ఉన్న ఆరు ఎడిఎంఈ పోస్టులను కూడా భర్తీ చేయనుంది.
Also Read: ‘విశ్వంభర’ సరికొత్త గ్లింప్స్ అదుర్స్..కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉంది!
* ప్రజారోగ్యంలో కీలక పాత్ర.. ప్రజారోగ్యంలో( public health) వైద్య ఆరోగ్యశాఖదే కీలక పాత్ర. కానీ గత కొంతకాలంగా ఆ శాఖలో కొత్తగా అధికారుల భర్తీ లేదు. పదోన్నతులు కూడా అంతంత మాత్రమే. అందుకే ఇప్పుడు క్షేత్రస్థాయిలో అధికారుల పదోన్నతులు, భర్తీపై దృష్టి పెట్టింది ఏపీ ప్రభుత్వం. వీలైనంత త్వరగా ఈ ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందేందుకు వీలుగా సర్వీసు నిబంధనలను సైతం ప్రభుత్వం సడలించింది. తద్వారా 77 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందనున్నారు. వీరితోపాటు 110 మంది డిప్యూటీ సివిల్ సర్జన్లు, అసిస్టెంట్ సర్జన్లు ను సివిల్ సర్జన్ల స్పెషలిస్టులుగా ప్రమోషన్ పొందనున్నారు. ముఖ్యంగా డ్రగ్ కంట్రోల్ విభాగాన్ని మరింత బలోపేతం చేయనుంది ప్రభుత్వం. ఆ విభాగంలో సైతం ప్రమోషన్లు ఇవ్వనుంది. నలుగురు అసిస్టెంట్ డైరెక్టర్లను డిప్యూటీ డైరెక్టర్లుగా, ఇద్దరు డిడిలను జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి ఇవ్వనున్నారు.
* ఖాళీల భర్తీకి చర్యలు
మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఖాళీల భర్తీకి డిపిసి( DPC) సిఫార్సులకు ఆమోదం తెలపాలని సంబంధిత విభాగ అధిపతులకు ఆదేశాలు ఇచ్చింది ప్రభుత్వం. ఆయుష్ విభాగంలో అదనపు సంచాలకుల పోస్టుకు కూడా ఆమోదం తెలిపింది. ఆయుర్వేద విభాగంలో పదోన్నతులకు అవకాశం ఇచ్చింది. హెల్త్ డిస్ట్రిక్ట్ మాస్ ఎడ్యుకేషన్ మీడియా ఆఫీసర్ల హెల్త్ ఎడ్యుకేషన్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లుగా కూడా ప్రమోషన్ ఇవ్వనుంది. అయితే దశాబ్ద కాలం తర్వాత ఈ ప్రమోషన్లు ప్రకటించడంతో వైద్య ఆరోగ్య శాఖలో సందడి నెలకొంది