Viral Video : ఆయన ఓ బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే.ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి.ఎంతో బాధ్యతగా వ్యవహరించాలి. కానీ అవేవీ పట్టించుకోలేదు ఆయన. మందేసి చిందేశారు. వింతగా ప్రవర్తించారు.తాగారు.. తూలుతూ మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అలా చేసింది టిడిపి ఎమ్మెల్యే కావడంతో వైసిపి ట్రోల్ చేయడం ప్రారంభించింది. అలాగని సంతోషం వ్యక్త పరచడం ఒక ఎత్తు అయితే.. హుందాగా ఉండడం మరో ఎత్తు. అందునా సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్న ఈ పరిస్థితుల్లో అలా చేయడం నిజంగా ఇబ్బందులు కొని తెచ్చుకోవడమే.ఇప్పుడు అలానే ఇబ్బంది తెచ్చుకున్నారు బాపట్ల టిడిపి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. ఓ బిజెపి నేత పుట్టినరోజు వేడుకల్లో ఆయన చేసిన అతి.. ఇప్పుడు ఆయనకు ఇబ్బంది తెచ్చి పెట్టేలా ఉంది. సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ప్రజల్లో విమర్శకు కారణమవుతోంది. ఈ నెల 10న ఈ ఘటన జరగగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
* బిజెపి నేత పుట్టినరోజు వేడుకల్లో
మాజీ ఎమ్మెల్సీ, బిజెపి నేత అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు వేడుకలు ఈనెల 10న పాండురంగాపురం యాగంటి రిసార్ట్స్ లో జరిగాయి. ఈ వేడుకలకు అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు సతీష్ ప్రభాకర్. ప్రత్యేక అతిథిగా వచ్చారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. మద్యం మత్తులో ఉన్న సతీష్ ప్రభాకర్, భీమ్లా నాయక్ పాట పెట్టించుకుని డాన్స్ చేశారు. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ సతీష్ తో కలిసి బెల్లీ డాన్స్,తీన్మార్ స్టెప్పులు వేశారు. అంతటితో ఆగకుండా సతీష్ చేతిలోని మద్యం గ్లాసును అందుకొని గుటుక్కున తాగేశారు. ఆ తరువాత సతీష్ బుగ్గలు నిమురుతూ ముద్దులతో ముంచెత్తారు. ఎమ్మెల్యే విన్యాసాలను చూసిన అక్కడివారు ఆయనకు కైపెక్కిందంటూ కామెంట్స్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వెలుగులోకి రావడంతో ఇదేం పద్ధతి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
* వైసిపి నేత సైతం
అయితే ఇదే వేడుకకు వైసీపీ నేత అనంత వర్మ కూడా హాజరయ్యారు.షాంపెయిన్ బాటిల్ ఓపెన్ చేసే క్రమంలో.. అన్ని ఆయనే ఓపెన్ చేయాలా అని ఒకరంటే.. ప్రోటోకాల్ అని వైసిపి నేత అనంత వర్మ అనడం.. సదరు బాటిల్ ను ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఓపెన్ చేయడం ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పుట్టినరోజు వేడుకలు జరిగిన వారం గడిచాక అక్కడ జరిగిన తతంగం బయటకు రావడం విశేషం. వేడుకల్లో పాల్గొన్న వారే కావాలని వీటిని బయటకు విడుదల చేశారని అనుమానాలు ఉన్నాయి. అయితే అది ప్రైవేటు కార్యక్రమం అయినా.. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉన్నా.. ఇలా బాధ్యతాయుతమైన ఎమ్మెల్యే అలా వ్యవహరించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.
బీజేపీ నేత అన్నం సతీష్ ప్రభాకర్ పుట్టినరోజు వేడుకల్లో పీకలదాకా మద్యం తాగి.. చిందేసిన బాపట్ల టీడీపీ ఎమ్మెల్యే నరేంద్రవర్మ
టీడీపీ ఎమ్మెల్యేలకి నువ్వు నేర్పించిన క్రమశిక్షణ ఇదేనా @ncbn ?#NaraLiquorBabu#IdhiMunchePrabhutvam#SadistChandraBabu#MosagaduBabu pic.twitter.com/v0f3FT3sWo
— YSR Congress Party (@YSRCParty) December 17, 2024