Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 10వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలకు, టీజర్ కి అభిమానులు, ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 21 వ తారీఖు నుండి ప్రొమోషన్స్ కూడా భారీ లెవెల్ లో ప్లాన్ చేసారు మేకర్స్. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ప్రారంభం అయ్యింది. లండన్ లో అయితే అప్పుడే 6 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. రెండు రోజుల క్రితమే నార్త్ అమెరికా లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. మన టాలీవుడ్ కి ఓవర్సీస్ లో అత్యధిక వసూళ్లను ఇచ్చే దేశం నార్త్ అమెరికా నే. ఈమధ్య కాలం లో మన తెలుగు సినిమాలు కేవలం ప్రీమియర్ షోస్ నుండి మూడు మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబడుతున్నాయి.
‘గేమ్ చేంజర్’ చిత్రం తో అంతకు మించిన భారీ వసూళ్లను ప్రీమియర్ షోస్ నుండి రప్పించాలని రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా కసితో ఉన్నారు. అయితే ఓవర్సీస్ బయ్యర్ ఈ సినిమా పట్ల వివక్ష చూపిస్తున్నాడని రామ్ చరణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఆ బయ్యర్ పై ఒక రేంజ్ లో విరుచుకుపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే చిరంజీవి, రామ్ చరణ్ అంటే ఒక వర్గానికి చెప్పలేనంత ద్వేషం ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. దశాబ్దాల నుండి ఇది కొనసాగుతూనే ఉంది. ఓవర్సీస్ లో సంక్రాంతికి విడుదల అవ్వబోతున్న ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలను ఆ బయ్యర్ యే కొనుగోలు చేసాడు. మన తెలుగు ఆడియన్స్ నార్త్ అమెరికా లో అత్యధికంగా సినిమాలను చూసేందుకు ‘సినీ మార్క్’ థియేటర్స్ ని ఎంచుకుంటారు.
ఈ థియేటర్స్ లో ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కేవలం 7 షోస్ ని మాత్రమే షెడ్యూల్ చేయగా, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ చిత్రానికి ఏకంగా 30 షోస్ ని షెడ్యూల్ చేసారు. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కేవలం రెగల్, AMC థియేటర్స్ లో మాత్రమే అత్యధికంగా షోస్ ని షెడ్యూల్ చేయించాడు. ఈ థియేటర్స్ లో విడుదలకు ముందు రోజు వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరగవు. అలాంటి చోట్ల ముందుగా ‘గేమ్ చేంజర్’ షోస్ షెడ్యూల్ చేయడం తో తక్కువ గ్రాస్ కనపడింది. దీనికి రామ్ చరణ్ పై సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ట్రోల్స్ నడుస్తున్నాయి. రామ్ చరణ్ మీద అలా ట్రోల్స్ రప్పించడానికే, బయ్యర్ బాలయ్య ఫ్యాన్ కాబట్టి కావాలని ఇలా చేసాడని రామ్ చరణ్ ఫాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. అయితే కేవలం టెక్నికల్ సమస్యలు ఎదురవ్వడం వల్లే ‘గేమ్ చేంజర్’ కి ముందుగా సినీ మార్క్ షోస్ షెడ్యూల్ చేయలేదని, రాబోయే రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ చేస్తామని ఆ చిత్రానికి సంబంధించిన బయ్యర్ ట్విట్టర్ లో తెలియచేసాడు.