Homeఆంధ్రప్రదేశ్‌Chintakayala Vijay: ఆ యువనేతకు రాజ్యసభ.. ఏకంగా మహానాడులో డిమాండ్!

Chintakayala Vijay: ఆ యువనేతకు రాజ్యసభ.. ఏకంగా మహానాడులో డిమాండ్!

Chintakayala Vijay: రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మహానాడు కొనసాగుతోంది. తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. ఇంధన ఆదాలో భాగంగా ప్రధాని సూచనతో పూర్తి డిజిటల్ విధానంలో నిర్వహిస్తున్న ఈ మహానాడుకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఏకకాలంలో లక్షలాదిమంది టిడిపి కార్యకర్తలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నారు. దాదాపు ఓ 20 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చిస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో తీర్మానాలను పెట్టాలని కూడా సూచించింది నాయకత్వం. అయితే ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ టిడిపి నుంచి వింత ప్రతిపాదన, తీర్మానం వచ్చింది. అది స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. అక్కడి టిడిపి శ్రేణులు అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కు పదవి ఇవ్వాలని తీర్మానించడం విశేషం.

* సుదీర్ఘ నేపథ్యం..
తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుబంధం చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబానికి. 1983 నుంచి ఇప్పటివరకు అంటే ఓ రెండు సార్లు తప్పించి.. ఏకధాటిగా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు అయ్యన్నపాత్రుడు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆయన మంత్రి అయ్యారు. ఈసారి మాత్రం శాసనసభ స్పీకర్ గా ఎంపికయ్యారు. 1998లో అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు అయ్యన్నపాత్రుడు. తెలుగుదేశం పార్టీ పట్ల విధేయత చూపించడంలో ముందుంటుంది అయ్యన్నపాత్రుడు కుటుంబం. ఆయన రాజకీయ వారసుడిగా విజయ్ తెరపైకి వచ్చారు. తండ్రి మాదిరిగా దూకుడుగా ఉంటారు. వైసిపి ఐదేళ్ల కాలంలో అస్సలు వెన్నుచూపలేదు. పైగా టిడిపి సోషల్ మీడియాకు విశేష సేవలు అందించారు. ప్రస్తుతం నర్సీపట్నం నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది.

* విజయ్ కు పదవి ఇవ్వాలని..
అయితే తాజా మహానాడులో విజయ్ కు రాజ్యసభ పదవి ఇవ్వాలని తీర్మానించింది టిడిపి. ఎందుకంటే ఆయన పార్టీ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ఇవ్వాలని నర్సీపట్నం టిడిపి క్యాడర్ కోరుకుంటుంది. గత కొద్ది రోజులుగా రాజ్యసభకు విజయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. బీసీ సామాజిక వర్గం ఆపై యువకుడు కావడంతో కలిసి వచ్చే అంశం. వైసిపి హయాంలో సైతం ధైర్యంతో ముందుకు సాగిన చరిత్ర ఆయనది. లోకేష్ టీంలో కీలక సభ్యుడు కూడా. అందుకే ఆయనకు రాజ్యసభ పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెలుగుదేశం పార్టీలోనే పెరుగుతుంది. చూడాలి మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper
Exit mobile version