TDP Leaders vs Janasena leaders: వారంతా కూటమి( alliance) పార్టీల శ్రేణులు. ఒకచోట సమావేశమయ్యారు. అందులో ఓ పార్టీ నేతలు నామినేటెడ్ పదవులు కోరారు. అలా మాట మాట పెరిగింది. వివాదంతో సమావేశం ముగిసింది. అంతటితో ముగిసింది అనుకుంటే అర్ధరాత్రి కూటమి నేతలు నడిరోడ్డుపై కుమ్ములాటలకు దిగారు. దారి కాచి మరి దాడులు చేసుకున్నారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలోని కొవ్వూరులో జరిగింది. కొద్దిరోజుల కిందట ఇదే నియోజకవర్గానికి చెందిన జనసేన ఇన్చార్జ్ టీవీ రామారావు పై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జనసేన నేతలను వెంటాడి కూటమి నేతలు దాడి చేశారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నామినేటెడ్ పదవులకు డిమాండ్..
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) కార్యాలయంలో సోమవారం కూటమి సమన్వయ సమావేశం జరిగింది. టిడిపి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జనసేన శ్రేణులు నామినేటెడ్ పదవుల విషయంపై డిమాండ్ చేశాయి. జనసేనకు కూటమిలో ఆశించిన స్థాయిలో ప్రాధాన్యం దక్కక పోవడం పై నిరసన వ్యక్తం చేశాయి. దీంతో సమావేశంలో రభస చోటు చేసుకుంది. అయితే జనసేన నాయకులపై అర్ధరాత్రి మూకుమ్మడి దాడి జరిగింది. దారుణంగా రహదారిపై కాచి మరీ కొట్టారు. ఈ ఘటనలో జనసేన నేతలకు గాయాలయ్యాయి. ఒకేసారి కూటమి నేతలు దాడులకు తెగపడ్డారు. అసలేం జరుగుతుందో స్థానికులకు అర్థం కాలేదు. గాయపడిన జనసేన నేతలు అర్ధరాత్రి దొమ్మేరు సెంటర్లో నిరసనకు దిగారు.
గత కొంతకాలంగా వివాదాలు..
అయితే గత కొంతకాలంగా కొవ్వూరు( kovvuru ) నియోజకవర్గ కూటమిలో విభేదాలు పెరుగుతూ వచ్చాయి. కొద్ది రోజుల కిందట జనసేన నేతలు కార్యకర్తలకు నామినేటెడ్ పదవుల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని జనసేన ఇన్చార్జ్ టీవీ రామారావు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. అయితే పొత్తు ధర్మాన్ని విఘాతం కలిగించేలా వ్యవహరించాలని ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. అప్పట్లో టీవీ రామారావు బోరున విలపించారు. ఆ ఘటన మరువకముందే ఇప్పుడు జనసేన నేతలపై టిడిపి శ్రేణులు దాడులకు పాల్పడడం విశేషం. అయితే అర్ధరాత్రి తమకు న్యాయం చేయాలని కోరుతూ జనసైనికులు నిరసన దీక్ష చేపట్టారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ దీక్ష శిబిరానికి వెళ్లి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు దీక్షను విరమించారు.
జనసేన నాయకుల్ని నడిరోడ్డుపై పిచ్చిపిచ్చిగా కొట్టిన టీడీపీ నాయకులు
కొవ్వూరు ఎమ్మెల్యే సమక్షంలో #TDP కార్యాలయంలో కూటమి సమావేశం జరిగింది.. ఈ సమావేశంలో మాకు నామినేటెడ్ పదవులు లేవని, కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని ఇలాగైతే రాజకీయంగా నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
వాళ్ల హెచ్చరిక… pic.twitter.com/nOR5OFZoOc
— greatandhra (@greatandhranews) September 9, 2025