https://oktelugu.com/

AV Subba Reddy Daughter : ఓ బజారు మనిషి ఆమె.. ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె ఘాటు హెచ్చరిక

పునరాలోచించుకోవాలని జశ్వంతిరెడ్డి కోరారు. మొత్తానికైతే అఖిలప్రియకు జశ్వంతిరెడ్డి ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. స్పష్టమైన హెచ్చరికలు పంపారు.  ఆమెను బజారు మనిషి అంటూ తిట్టిపోశారు

Written By:
  • Dharma
  • , Updated On : May 17, 2023 / 07:05 PM IST
    Follow us on

    AV Subba Reddy Daughter : నంద్యాల టీడీపీలో భగ్గుమన్న విభేదాలు ఇప్పట్లో కొలిక్కి వచ్చిన పరిస్థితులు కనిపించడం లేదు.. ఇవి నివురుగప్పిన నిప్పులా మారుతున్నాయి. అటు హైకమాండ్ నేతలను పంపించి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినా దారిలోకి రావడం లేదు. అయితే తన తండ్రి ఏవీ సుబ్బారెడ్డిపై జరిగిన దాడిపై కుమార్తె జశ్వంతిరెడ్డి ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. మాజీ మంత్రి అఖిల ప్రియకు స్పష్టమైన హెచ్చరికలు పంపారు. తానేంటో చూపిస్తానని కూడా హెచ్చరించారు. దీంతో టీడీపీ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇది ఎంతవరకూ దారితీస్తుందోనన్న ఆందోళన నెలకొంది.

    నారా లోకేష్ యువగళం పాదయాత్ర నంద్యాల జిల్లాలో కొనసాగున్న సంగతి తెలిసిందే. మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోకి ప్రవేశించగా.. లోకేష్‌కు ఘన స్వాగతం పలికేందుకు అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి వర్గాలు కొత్తపల్లి దగ్గర భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగింది. తొలుత అఖిలప్రియ,సుబ్బారెడ్డి.. మధ్య తొలుత మాటలయుద్ధం చోటు చేసుకుంది. నడిరోడ్డు మీదే వారు ఘాటు పదాలతో రెచ్చిపోయారు. పరస్పరం దూషించుకున్నారు. ఒక దశలో భూమా అఖిలప్రియ వర్గీయులు తొడగొట్టి సవాల్ విసిరారు. అక్కడితో ఆగలేదు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారు.. పిడిగుద్దులు గుద్దారు. భూమా వర్గీయుల దాడిలో ఏవీ సుబ్బారెడ్డి నోటి నుంచి రక్తం కారింది.

    భూమా నాగిరెడ్డికి ఏవీ సుబ్బారెడ్డి ప్రాణమిత్రుడు. కానీ మారిన రాజకీయ పరిస్థితులతో రెండు కుటుంబాల మధ్య ఎడబాటు పెరిగింది. తాజాగా ఈ  ఘటనపై ఏవీ సుబ్బారెడ్డి కూతురు జశ్వంతి రెడ్డి స్పందించారు. భూమా అఖిలప్రియపై ఘాటు విమర్శలు చేశారు. తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో లైవ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి తాను గానీ, తన తండ్రి గానీ పోటీచేస్తామని  తేల్చి చెప్పారు. ఒక వేళ తమకు కాదని అఖిలప్రియకు టిక్కెట్ ఇచ్చినా ఆమె ఓటమికి ప్రయత్నిస్తామని శపధం చేశారు. ప్రేమతో ఎత్తుకు పెంచిన తన తండ్రిపై అఖిలప్రియ దాడి చేయడం దారుణమన్నారు. ఆమె తన లోక్లాస్ మైండ్ సెట్ ను చాటుకున్నారని ఎద్దేవా చేశారు. ఆమెకు టిక్కెట్ విషయంలో టీడీపీ నాయకత్వం పునరాలోచించుకోవాలని జశ్వంతిరెడ్డి కోరారు. మొత్తానికైతే అఖిలప్రియకు జశ్వంతిరెడ్డి ఘాటుగా రిప్లయ్ ఇచ్చారు. స్పష్టమైన హెచ్చరికలు పంపారు.  ఆమెను బజారు మనిషి అంటూ తిట్టిపోశారు.