Nara Lokesh : నారా లోకేష్ కు( Nara Lokesh ) ప్రమోషన్ ఖాయమా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తారా? ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా? లేకుంటే జాతీయ అధ్యక్ష పగ్గాలు అందిస్తారా? ఇప్పుడు అంతటా ఇదే చర్చ. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి ప్రభుత్వంలో కీరోల్ ప్లే చేస్తున్నారు లోకేష్. సుదీర్ఘ పాదయాత్ర తో పాటు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా లోకేష్ గట్టిగానే నిలబడ్డారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అందుకే ఇదే మంచి సమయమని.. మహానాడు వేదికగా లోకేష్ ను ప్రమోట్ చేయాలని చంద్రబాబును సన్నిహిత నేతలు కోరినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి తెర వెనుక స్కెచ్ సిద్ధమైనట్లు సమాచారం. నారా లోకేష్ కు ఇకపై నుంచి ఫుల్ పవర్స్ ఇవ్వనున్నట్లు ప్రచారం సాగుతోంది.
* ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు
తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పండుగ మహానాడుకు రంగం సిద్ధం అయ్యింది. ఈనెల 27 నుంచి మూడు రోజులపాటు కడపలో మహానాడు జరగనుంది. గత కొద్ది రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మంది కార్యకర్తలు మహానాడుకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ తో పాటు రాయలసీమకు చెందిన మంత్రులు ఏర్పాట్ల బాధ్యతలు చూస్తున్నారు. ఈసారి మహానాడుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చంద్రబాబు 75 వసంతాలు పూర్తి చేసుకున్నారు. మరోవైపు టిడిపి ఆవిర్భావం తర్వాత ఇంతటి విజయాన్ని ఎన్నడు దక్కించుకోలేదు. అందుకే పార్టీ ప్రత్యర్థిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ప్రతిష్టాత్మకంగా మహానాడు ను నిర్వహిస్తున్నారు. విజయవంతంగా పూర్తి చేసేందుకు ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్నారు.
Also Read : ప్రధాని చెంతకు లోకేష్.. చంద్రబాబు నయా ప్లాన్!
* కడపలో మహానాడు..
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ పుట్టిన రోజును మహానాడు( mahanadu ) నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎన్టీఆర్ చనిపోయి దశాబ్దాలు దాటుతున్న ఆయన జయంతి నాడు ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా.. లేకపోయినా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తోంది టిడిపి నాయకత్వం. అయితే ఇంతవరకు కడప జిల్లాలో మహానాడును నిర్వహించలేదు. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డికి అడ్డాగా ఉంది ఈ జిల్లా. అటు తర్వాత ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి హవా కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఉమ్మడి కడప జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను కేవలం మూడు చోట్ల మాత్రమే ఆ పార్టీ విజయం సాధించింది. ఏడు స్థానాల్లో టిడిపి సత్తా చాటింది. అందుకే అక్కడ పట్టు బిగించాలని చూస్తోంది. అందులో భాగంగానే మహానాడు ను అక్కడ నిర్వహించాలని భావిస్తోంది.
* 19 కమిటీల ఏర్పాటు..
మరోవైపు మహానాడుకు సమయం ఆసన్నమవుతుండడంతో టిడిపి హై కమాండ్( TDP high command ) 19 కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలే క్రియాశీలక పాత్ర పోషించునున్నాయి. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తో పాటు బక్కని నరసింహులు ఆహ్వాన కమిటీగా ఉంటారు. మరోవైపు నారా లోకేష్ నేతృత్వంలో సమన్వయ కమిటీ ఏర్పాటు చేశారు. యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో తీర్మానాలు, అచ్చం నాయుడు నేతృత్వంలో వసతి ఏర్పాటు, రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో సభ నిర్వహణ, బీసీ జనార్దన్ రెడ్డి నేతృత్వంలో భోజనాలు కమిటీలను ఏర్పాటు చేశారు. ఒక్కో కమిటీలు పది నుంచి 20 మంది నేతలకు చోటు కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది కార్యకర్తలు టిడిపి మహానాడుకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. అయితే ఇంతకుముందే కడప జిల్లా నేతలతో కూడిన కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక స్థాయిలో ఏర్పాట్లపై ఈ కమిటీలు క్రియాశీలకంగా పని చేశాయి. మహానాడు మూడు రోజులపాటు జరగనున్న నేపథ్యంలో ఈ 19 కమిటీలు కీలకంగా పని చేయనున్నాయి.
Also Read : అలకలు వద్దు.. అందరూ అలా చేయండి.. నారా లోకేష్ కీలక సూచనలు!
* నందమూరి కుటుంబ సభ్యులకు ఆహ్వానం..
మరోవైపు నందమూరి కుటుంబ సభ్యులకు ( Nandamuri family members) ఆహ్వానాలు పంపినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ మహానాడులో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ ప్రమోషన్ పై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఆయనకు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా కల్పిస్తారని తెలుస్తోంది. అందుకే ఈసారి మహానాడు వేదికగా చాలా రకాల నిర్ణయాలు ఉంటాయని సమాచారం. ఇంకోవైపు మహానాడులో పసందైన వంటకాలు పార్టీ శ్రేణులకు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆహారం మెనూలో అన్ని రకాల జాగ్రత్తలు.. అన్ని ప్రాంతాల ఆహారానికి సమప్రధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది.