AP Development : ఏపీ ప్రభుత్వం( AP government ) దూకుడు మీద ఉంది. కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఏపీ క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. అందులో భాగంగా నిన్న జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భూ కేటాయింపులతో పాటు కొత్త ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి వివరాలను మంత్రులు పార్థసారథి, నాదెండ్ల మనోహర్ మీడియాకు వివరించారు. ఏపీవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫైవ్ స్టార్ హోటళ్ళకు అనుమతి ఇచ్చారు. వాటికి భూ కేటాయింపులు చేశారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతోంది. ప్రతి 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ సమావేశం జరుగుతోంది. సంక్షేమ పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు మోక్షం కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది క్యాబినెట్. అయితే జూన్ 12 నాటికి ఏపీ కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతోంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏడాదిలో చివరి క్యాబినెట్ సమావేశం కూడా. ఇటువంటి తరుణంలో కీలక నిర్ణయాలు తీసుకుంటూ మంత్రివర్గ సమావేశం ఆసక్తికరంగా సాగింది.
Also Read : కూటమి’పై జగన్ ప్రతీకారం తప్పదా?
* పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సులకు గ్రీన్ సిగ్నల్..
పలు సంస్థలకు సంబంధించి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు చేసిన సిఫార్సులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. డెక్కన్ ఫైన్ కెమికల్స్( Deccan fine chemicals ), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, బ్లూ జెట్ హెల్త్ కేర్ లిమిటెడ్, జూపిటర్ రెన్యువల్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిఫార్సులపై క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఐదు కంపెనీల ద్వారా దాదాపు రాష్ట్రంలో 9246 కోట్ల రూపాయల పెట్టుబడులకు అవకాశం కలగనుంది. దాదాపు 8 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీంతో పాటు ఎస్ఐపిపి తీసుకున్న ఇతర నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
* భోగాపురం ఎయిర్పోర్ట్ కు 500 ఎకరాలు
మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ లెదర్, ఫుట్ వేర్ పాలసీ( Andhra Pradesh Leather footwear policy) 2024-30 ప్రతిపాదనకు సైతం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. భోగాపురం గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయ అభివృద్ధికి 500 ఎకరాల భూమిని పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది. మంత్రుల బృందం అంగీకారం తెలుపుతూ చేసిన సిఫారసులను క్యాబినెట్ ఆమోదించింది. విశాఖ బీచ్ రోడ్ లో తాజ్ గేట్ వే అభివృద్ధి కోసం 5 స్టార్ డీలక్స్ హోటల్ కం సర్వీస్ అపార్ట్మెంట్స్ గా మార్చేందుకు ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్. ప్రోత్సాహకాలకు పెట్టుబడుల బోర్డు ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
* తిరుపతిలో పర్యాటక ప్రతిపాదనలపై.. తిరుపతిలో( Tirupati) పర్యాటకంగా కీలక ప్రతిపాదనలకు సైతం ఆమోదం తెలిపింది ఏపీ క్యాబినెట్. ఐ బి ఐ ఎస్ స్టైల్స్ 3 స్టార్, నోవోటల్ 5 స్టార్ క్లస్టర్ హోటల్ అభివృద్ధి కోసం స్రవంతి హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు వారికి ప్రోత్సాహకాలు అందించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే లక్ష్మీపురం వడమాల పేట వద్ద ఫైవ్ స్టార్ రిసార్ట్ల అభివృద్ధి కోసం ఆమోదముద్ర వేసింది. మొత్తానికైతే కీలక భూముల కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయడం విశేషం.