TDP Favoired Journlist :సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఎజెండా లక్ష్యంగా.. గిట్టని వాళ్ళ మీద బురద చల్లడమే టార్గెట్ గా రాజకీయ పార్టీలు వీడియోలు రూపొందిస్తున్నాయి. ఇందులో విలువలు.. ఇతర విషయాలను పక్కనపెట్టి కేవలం వ్యక్తిత్వ హననానికి మాత్రమే పాల్పడుతున్నాయి. నేను బురద చల్లుతాను.. ఆ తర్వాత కడుక్కోవడం నీ ఇష్టం అనే తీరుగా ఆ వీడియోలు ఉంటున్నాయి. ఇలాంటి వీడియోలు ఏపీలో పోటాపోటీగా కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కూటమి.. ప్రతిపక్షంలో ఉన్న ఫ్యాన్ పార్టీ ఏమాత్రం తగ్గకుండా వీడియోలు పోస్ట్ చేస్తున్నాయి. అయితే ఇందులో ఫ్యాన్ పార్టీ అనుబంధ సామాజిక మాధ్యమ విభాగం రూపొందించిన ఒక వీడియో చర్చకు దారితీస్తోంది.. గతంలో “బాబు” అరెస్ట్ అయినప్పుడు.. ఆయననను కొడతారా? అంటూ ఓ మీడియా ఛానల్లో పని చేసే జర్నలిస్టు వ్యాఖ్యానించాడు. దీనికి సంబంధించి ఆయన ఒక డిబేట్ కూడా నిర్వహించాడు. ఆ డిబేట్లో చంద్రబాబు స్తుతి రాగానికి అవధి అంటూ లేకుండా పోయింది. పైగా చంద్రబాబును అరెస్టు చేయడం సరికాదని.. ఆయనను జైల్లో వేసి కొడతారని ఆ జర్నలిస్టు నేరుగానే ప్రశ్నించాడు. తను న్యూట్రల్ గా ఉండాల్సిన వ్యక్తిని.. ఇలాంటి కామెంట్ చేయడం సరికాదనే విషయాన్ని కూడా అతను మర్చిపోయాడు.
Also Read :అంబటికి పోలీసుల షాక్ ట్రీట్మెంట్!
నాడు “బాబు” అరెస్ట్ అయినప్పుడు ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉంది. నాడు “బాబు” అరెస్టును వైసీపీ సమర్ధించుకుంది. ప్రతిపక్షంలో ఉన్న టిడిపి చంద్రబాబు అరెస్టును విమర్శించింది.. కాలం గడిచింది. టిడిపి కూటమి గా ఏర్పడి అధికారంలోకి వచ్చింది. ఇక ఇటీవల ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలిలో గంజాయి విక్రయిస్తున్నారు.. అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.. కానిస్టేబుల్ పై ఇష్టానుసారంగా వ్యవహరించారు అని అభియోగాలు ఉన్న వ్యక్తులను పోలీసులు చితక్కొట్టారు. వారిని అందరు చూస్తుండగానే చితక బాదారు.. అయితే ఈ వ్యవహారాన్ని తన పొలిటికల్ మైలేజ్ కోసం వైసీపీ సహజంగానే వాడుకుంది. ఇష్టానుసారంగా ప్రసారం చేసింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలీసులు కొట్టిన వారిని పరామర్శించారు.. ఇదే అదునుగా వైసీపీ సోషల్ మీడియా విభాగం గతంలో “బాబు” ను అరెస్ట్ చేసినప్పుడు ఓ వర్గం మీడియాలో పనిచేసే జర్నలిస్టులు చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు ప్రముఖంగా ప్రస్తావిస్తోంది.. చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు.. కొడతారా అంటూ నాడు ఓవర్గం మీడియాలో పనిచేసిన జర్నలిస్టులు వ్యాఖ్యానించారని.. అలాంటప్పుడు గంజాయి కేసులో ఉన్న వ్యక్తులను పోలీసులు ఎలా కొడతారని.. వైసిపి నాయకులు ప్రశ్నిస్తున్నారు..” చంద్రబాబు మీద ఈగ వాల వాడకూడదు. ఆయనకు ఎటువంటి ఇబ్బంది ఎదురు కాకూడదు. కానీ మిగతా వారికి ఇవేవీ వర్తించకూడదు. చంద్రబాబు కేసులు ఉన్నప్పటికీ జైలుకు వెళ్ళకూడదు. కానీ సామాన్యుల మీద చిన్న చిన్న కేసులున్నా పోలీసులు వారిని కొట్టొచ్చు. పైగా వారిని ఇబ్బంది పెట్టొచ్చు.. ఇదే కూటమి ప్రభుత్వ ధర్మం అనుకుంటా.. ఇదే కూటమి గవర్నమెంట్ మార్క్ న్యాయం అనుకుంటా.. ఇదే విషయాన్ని కూటమినేతలకు చెబితే వారికి మండుతోందని” వైసిపి అనుబంధ సోషల్ మీడియా విభాగం నాయకులు పేర్కొంటున్నారు.. అంతేకాదు టిడిపి నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలను కట్ చేసి వీడియోలు రూపొందిస్తున్నారు. అటు టిడిపి నేతలు కూడా ఏమాత్రం తగ్గకుండా వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో అటు వైసిపి ఇటు టిడిపి మధ్య బీభత్సమైన రణం జరుగుతోంది.
పచ్చ బ్యాచ్ కి బాగా మండుతున్నట్టుంది #1YearForCBNBackStabbing pic.twitter.com/qoD3cg8lGO
— రామ్ ®️ (@ysj_45) June 4, 2025