BRS MLA Maganti Gopinath: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్రఅస్వస్థతకు గురయ్యారు. గుండె సమస్యలతో బాధపడుతున్న ఆయనను గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గోపినాథ్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, తదితరులు ఆస్పత్రికి చేరుకున్నారు.