Lagadapati  Rajagopal : టీడీపీ, జనసేన పొత్తు కష్టం.. లగడపాటి షాకింగ్ కామెంట్స్

ఓ ఇంటర్వ్యూలో టీడీపీ జనసేన పొత్తు ప్రభావంపై లగడపాటిని ప్రశ్నించగా... ఆయన పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా...   చిన్న పార్టీలు తమ ఓట్లను పెద్ద పార్టీలకు సులభంగా ఓటు బదిలీ చేస్తాయి. కానీ  పెద్ద పార్టీల ఓట్లు చిన్న పార్టీలకు రావడం కష్టం. కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఇదే సమస్య ఎదురైంది అని లగడపాటి అన్నారు.

Written By: Dharma, Updated On : June 4, 2023 11:51 am
Follow us on

Lagadapati  Rajagopal : ఏపీలో టీడీపీ, జనసేన మధ్య పొత్తుపై లగడపాటి రాజగోపాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రెండు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, ఓటు షేరింగ్ పై తన మనసులో ఉన్న మాటలను బయటపెట్టారు. లగడపాటి రాజగోపాల్ మాజీ ఎంపీయే కాదు. ఆంధ్రా ఆక్టోపస్ గా పేరుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ పార్టీకి దూరమయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. రాష్ట్ర విభజన పూర్తయిన సందర్భంగా పలు మీడియా సంస్థలు ఆయనతో ఇంటర్వ్యూలు చేశాయి. ఈ క్రమంలో సమకాలిన రాజకీయ అంశాలపై ఆయన మాట్లాడారు.
రాజకీయాల్లోకి మరోసారి రాదలచుకోలేదని లగడపాటి క్లారిటీ ఇచ్చారు. 2004లో విజయవాడ ఎంపీగా పోటీచేసిన రాజగోపాల్  వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడు ఎన్నికల ఫలితాలపై ఎప్పటికప్పుడు సర్వే చేయించేవారు. ఆయన సర్వే99 శాతం కచ్చితత్వంతో కూడుకున్నది అని ఒక అభిప్రాయం ఉంది. గతంలో చాలాసార్లు సర్వేచేసి ఇవ్వడంతో కాంగ్రెస్ హైకమాండ్ కూడా ప్రత్యేకంగా గుర్తించింది. 2019 లో చేసిన సర్వే ఘోరంగా తప్పింది. దీంతో ఆయన  ఆ తర్వాత పూర్తిగా అదృశ్యమయ్యాడనే చెప్పాలి. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు.
ఏపీ రాజకీయాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూలో టీడీపీ జనసేన పొత్తు ప్రభావంపై లగడపాటిని ప్రశ్నించగా… ఆయన పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా…   చిన్న పార్టీలు తమ ఓట్లను పెద్ద పార్టీలకు సులభంగా ఓటు బదిలీ చేస్తాయి. కానీ  పెద్ద పార్టీల ఓట్లు చిన్న పార్టీలకు రావడం కష్టం. కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఇదే సమస్య ఎదురైంది అని లగడపాటి అన్నారు. జనసేన నుంచి టీడీపీకి ఓటు బదిలీ ఈజీ అయితే టీడీపీ నుంచి జనసేనకు ఓట్ల బదిలీ కష్టమని లగడపాటి చెబుతున్నట్లుగా కనిపిస్తోంది. ఓట్ల షేరింగ్ పై జాగ్రత్త పడాలని ఆ రెండు పార్టీలకు లగడపాటి కీలక సూచనలు ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే గత కొంతకాలంగా ఆయన చంద్రబాబుతో సన్నిహితంగా మెలుగుతున్నారు కాబట్టి. అయితే ఇంటర్వ్యూలో చెప్పిన ఆయన చంద్రబాబుతో నేరుగానే చెప్పి ఉంటారన్న అభిప్రాయం అంతటా నెలకొంది.