Homeఆంధ్రప్రదేశ్‌Talliki Vandanam Welfare Schemes : కూటమి వ్యూహాన్ని తేల్చేయనున్న 'తల్లికి వందనం'!

Talliki Vandanam Welfare Schemes : కూటమి వ్యూహాన్ని తేల్చేయనున్న ‘తల్లికి వందనం’!

Talliki Vandanam Welfare Schemes  : ఏపీలో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. పాలనతో పాటు సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టింది కూటమి ప్రభుత్వం. అయితే తొలి మూడు నెలల సొంత శాఖలపై పట్టు సాధించేందుకు మంత్రులు ప్రయత్నించారు. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అమరావతి రాజధానితో పాటు పోలవరం ప్రాజెక్టుపై దృష్టి పెట్టింది. మధ్యలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు పల్లె పండుగ వంటి కార్యక్రమాలు నిర్వహణపై ఫోకస్ చేసింది. అయితే పాలన వరకు ఒకే కానీ సంక్షేమ పథకాల విషయంలో మాత్రం వెనుకబడింది. దీనిని గుర్తించిన సీఎం చంద్రబాబు ప్రజల్లో ప్రభావితం చేసే సంక్షేమ పథకాల అమలుకు నిర్ణయం తీసుకున్నారు.

Also Read : నామినేటెడ్ లిస్టు సిద్ధం.. టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు, లోకేష్ గుడ్ న్యూస్

* బడ్జెట్ కేటాయింపులు
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్ను శాసనసభలో పెట్టారు. సంక్షేమ పథకాలకు కేటాయింపులు చేశారు. అయితే లేనిపోని పథకాలపై దృష్టి పెట్టకుండా.. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలు, ప్రధానమైన వాటినే అమలు చేయాలని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చారు. సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని చంద్రబాబు స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు సమాచారం. ముఖ్యంగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి.. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత మార్చుకోవాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే అంతర్గత సర్వేలు కూడా పూర్తి చేసిన చంద్రబాబు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పథకాన్ని అమలు చేయాలని చూస్తున్నారు.

* అప్పట్లో అమ్మ ఒడి
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పేరిట పథకాన్ని అమలు చేసేవారు. ఇంట్లో ఒక పిల్లాడికి మాత్రమే పథకం వర్తింపజేశారు. ఏటా చదువుకు ప్రోత్సాహం కింద పదిహేను వేల రూపాయల మొత్తాన్ని అందించేవారు. అయితే తొలి సంవత్సరం వెయ్యి రూపాయలు కోత విధించారు. తరువాత ఏడాది రెండు వేల రూపాయలు తగ్గించేశారు. అయితే తాము అధికారంలోకి వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది చదువుకు 15000 రూపాయల చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు ఆ హామీ అమలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఈ పథకం అమలు చేస్తే ప్రజల్లో ఒక రకమైన మార్పు ఖాయమని.. కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత కూడా వస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

* పెద్ద ఎత్తున అభివృద్ధి
ఇప్పటికే అభివృద్ధి పనులు( development works) పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. గ్రామాల్లో మౌలిక వసతులకు పెద్ద పీట వేస్తూ పనులు చేపడుతున్నారు. ఇంకోవైపు అమరావతి రాజధాని నిర్మాణ పనులు ఊపందుకుంటున్నాయి. ఒకవైపు అభివృద్ధి చూపిస్తూనే.. ఇంకోవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తే పాజిటివ్ రావడం ఖాయమని చంద్రబాబు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఎంత కష్టమైనా ప్రధాన సంక్షేమ పథకాలను అమలు చేయాలని చూస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు సఫలీకృతం అవుతారో చూడాలి.

Also Read : ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ ముగ్గురు.. చంద్రబాబు సంచలనం.. ఆ నిర్ణయాలు వెనుక కారణం అదే!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular