Talliki Vandanam to 12 Students: తల్లికి వందనం( thalliki Vandanam) సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఎన్నో కుటుంబాల్లో ఎనలేని ఆనందం నింపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ అవుతున్నాయి. ఒక కుటుంబంలో ఒకరికి.. మరో కుటుంబంలో ఇద్దరికీ.. ఇంకో ఇంట్లో ముగ్గురికి.. ఇలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం నిధులు జమ అవుతున్నాయి. ఒక్కో కుటుంబంలో ఆరుగురు విద్యార్థుల వరకు లబ్ధి పొందిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా తెలుగుదేశం పార్టీ ఆసక్తికర పోస్ట్ చేసింది. ఒకరికి కాదు ఇద్దరికీ కాదు ఓ ఉమ్మడి కుటుంబంలో ఏకంగా 12 మంది పిల్లలకు తల్లికి వందనం వర్తించింది. ఏకంగా ఆ కుటుంబానికి ఒకేసారి రూ.1.56 లక్షలు లబ్ధి చేకూరింది. దీంతో ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Also Read: Talliki Vandanam Scheme Rules: కరెంట్ ఎక్కువ కాలిస్తే ‘తల్లికి వందనం’ కట్ నా..? ఇదేంది ‘బాబు’
ఉమ్మడి కుటుంబంలో..
అన్నమయ్య జిల్లా( Annamayya district) కలకడలో ఓ ఉమ్మడి కుటుంబంలో ఏకంగా ఓ పన్నెండు మంది విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం తల్లుల ఖాతాల్లో జమ అయ్యింది. ఉమ్మడి కుటుంబంలో 12 మంది పిల్లలు ఉన్నారు. వారంతా ఉమ్మడిగానే ఉంటారు. ఈ తరుణంలో వేరువేరు పాఠశాలల్లో వారు పిల్లలు చదువుతున్నారు. ఈ క్రమంలో ఆ 12 మందికి ఒకేసారి తల్లికి వందనం కింద 13 వేల రూపాయలు జమ అయ్యాయి. దీంతో ఆ ఒక్క కుటుంబానికి లక్ష యాభై వేల రూపాయలకు పైగా లబ్ధి చేకూరింది. ఇదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ తన ఎక్స్ అకౌంట్ లో వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది. వారంతా టిడిపి కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.
Also read: Thalliki Vandanam Viral Song: నీకు 15 వేలు.. నీకు 18 వేలు.. వైసిపి మాస్ ర్యాగింగ్ కు బ్రేక్!
ఒకే కుటుంబంలో ఆరుగురికి..
అనంతపురం జిల్లా( Ananthapuram district) విడపనకల్లు మండలం మాలాపురం గ్రామానికి చెందిన రత్నమ్మ, రామాంజనేయులు దంపతులకు ఆరుగురు సంతనం. అందులో ఏకంగా ఐదుగురు పిల్లలకు తల్లికి వందనం వర్తించింది. ఒకేసారి 65 వేల రూపాయలు జమ అయ్యింది. మరో కుమార్తె ఒకటో తరగతిలో చేర్పించేందుకు సిద్ధంగా ఉంది. ఆమెకు సైతం తల్లికి వందనం జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇలా ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకం వర్తించడంపై సంతృప్తి వ్యక్తం అవుతోంది. కూటమి ప్రభుత్వం పట్ల సానుకూలత ప్రారంభం అయింది.