Talliki Vandanam Scheme: కూటమి ప్రభుత్వం( Alliance government ) కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్న నేపథ్యంలో ఒక్కో సంక్షేమ పథకాన్ని పట్టాలెక్కించాలని చూస్తోంది. అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే ప్రజల్లో చిన్నపాటి అసంతృప్తి రాకుండా జాగ్రత్త పడుతున్నారు చంద్రబాబు. తాజాగా కీలక ప్రకటన చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారింది అన్నారు. అందుకే సంక్షేమ పథకాలను సకాలంలో అమలు చేయలేకపోతున్నామని చెప్పుకొచ్చారు. అయినా సరే సంక్షేమ పథకాలను అందిస్తామని తేల్చి చెప్పారు చంద్రబాబు. ముఖ్యంగా గత ప్రభుత్వం అమలు చేసిన అమ్మ ఒడి పథకాన్ని అమలు చేసి తీరుతామన్నారు. తల్లికి వందనం పేరిట పథకం అమలు చేస్తామని.. మే నెలలో తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రకటించారు.
Also Read: వైసీపీలో అధినేత మనసులో.. జనసేనలో ద్వితీయ శ్రేణి నేతలతో.. మాజీ మంత్రిపై వీడియో వైరల్!
* సూపర్ సిక్స్ పథకాలలో..
సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైనది తల్లికి వందనం( thalliki Vandanam ) పథకం. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పేరిట ఈ పథకాన్ని అమలు చేసేవారు. ఇంట్లో ఒక పిల్లాడి చదువుకు ఆర్థిక సాయం అందించారు. తొలి ఏడాది 15 వేల రూపాయల చొప్పున అందించిన జగన్మోహన్ రెడ్డి సర్కార్… తరువాత 14 వేలకు, తరువాత 13 వేలకు పరిమితం చేసింది. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకు 15000 రూపాయల చొప్పున అందిస్తామని ఎన్నికల్లో ప్రకటించారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది సమీపిస్తున్నా ఇంకా అమలు చేయలేదు.
* సీఎం ఫుల్ క్లారిటీ..
అయితే ఈరోజు గోదావరి జిల్లా తణుకులో( Tanuku ) పర్యటించారు సీఎం చంద్రబాబు. తల్లికి వందనం పథకం పై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అమలుపై ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల వార్షిక బడ్జెట్లో తల్లికి వందనం పథకానికి కేటాయింపులు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సీఎం చంద్రబాబు పథకం అమలు షెడ్యూల్ సైతం ప్రకటించడంతో ప్రజల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది. తప్పకుండా అమలు చేస్తారని నమ్మకం గా చెబుతున్నారు.
* విద్యా సంవత్సరం ప్రారంభంలోనే..
వాస్తవానికి ఏప్రిల్ నా 24 నుంచి విద్యార్థులకు వేసవి సెలవులు( summer holidays) ప్రకటిస్తారు. జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. అయితే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పేరిట నిధులు జమ చేసి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే మంత్రులు సైతం ఈ పథకంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా సీఎం చంద్రబాబు ప్రకటించేసరికి తప్పకుండా అమలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి ఈ ఈ పథకం అమలు చేస్తారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం బడికి వెళ్తున్న పిల్లల సంఖ్య 82 లక్షలు గా ఉంది. ఈ లెక్కన 13వేల కోట్లకు పైగా నిధులు అవసరం. కాగా విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేయాలంటే విధిగా 75% హాజరు ఉండాల్సిందే. దీనినే ప్రామాణికంగా తీసుకొని పథకాన్ని అమలు చేయడానికి కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
Also Read: విమానంలో హోలీ సంబురాలు.. అమ్మాయిలతో స్పెప్పులు వేయించిన స్పైస్ జెట్.. వీడియో వైరల్!