https://oktelugu.com/

Avinash Reddy: కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు.. వివేకా కేసులో కీలక మలుపు*

గత ఐదున్నర సంవత్సరాలుగా వివేకానంద రెడ్డి హత్య కేసు నలుగుతూనే ఉంది. ఆయన కుమార్తె సునీత న్యాయ పోరాటం చేస్తున్నారు. అదే సమయంలో నిందితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్ పొందుతున్నారు. ఈ తరుణంలో సుప్రీంకోర్టు నిందితులకు నోటీసులు జారీ చేయడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : November 19, 2024 / 05:30 PM IST

    Kadapa MP Avinash Reddy

    Follow us on

    Avinash Reddy: వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక మలుపు. ఈరోజు మరో పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు మరో నిందితుడు దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డికి కూడా నోటీసులు పంపింది. వైయస్ సునీత పిటిషన్ పై విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసింది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో చాలామంది నిందితులను సిబిఐ అరెస్టు చేసింది. అందులో దస్తగిరి అనే నిందితుడు అప్రూవర్ గా మారాడు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితుడిగా ఉన్న దేవి రెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి దస్తగిరికి బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. చైతన్య రెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కూడా. అందుకే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తుబేలు రద్దు చేయాలని సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ఇవాళ స్పందించి నోటీసులు జారీ చేసింది. వైయస్ అవినాష్ రెడ్డికి గతంలో బెయిల్ ఇచ్చిన సందర్భంగా హైకోర్టు పలు షరతులు విధించింది.దర్యాప్తును ప్రభావితం చేయకూడదని,సాక్షులను బెదిరించకూడదు అన్నది ప్రధాన షరతులు. అయితే వీటిని అవినాష్ రెడ్డి ఉల్లంఘించారని సునీత ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు కోర్టు నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.

    * మార్చి మూడు కు విచారణ వాయిదా
    సునీత పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. సిజేఐ జస్టిస్ సంజీవ్ కన్నా బెంచ్ వీటిపై వివరణ ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి తో పాటు బెదిరింపులకు దిగిన చైతన్య రెడ్డికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ మార్చి మూడు కు వాయిదా వేసింది. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి విచారణలో చాలా జాప్యం జరుగుతూ వస్తోంది. 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. సీబీఐ విచారణ నాలుగు అడుగులు ముందుకు పడితే.. అయిదు అడుగుల వెనక్కి అన్న పరిస్థితి నెలకొంది. ఒకవైపు సునీత న్యాయపోరాటం చేస్తుండగా.. ఈ కేసులో నిందితులందరికీ బెయిల్ లభిస్తుండడం విశేషం.

    * పీఏ కోసం గాలింపు
    మరోవైపు సోషల్ మీడియాలో తనను వేధించారంటూ వైఎస్ సునీత వర్ర రవీందర్ రెడ్డి పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే సునీతతో పాటు విజయమ్మ, షర్మిలపై పోస్టులు పెట్టేందుకు అవసరమైన కంటెంట్ను అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇచ్చారని విచారణలో చెప్పారు రవీందర్ రెడ్డి. ఈ తరుణంలో వైయస్ సునీత ఇటీవల కడప ఎస్పీ ని కలిశారు. ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాఘవరెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన పట్టుబడితే మాత్రం ఎంపీ అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగిసుకునే అవకాశం ఉంది.