https://oktelugu.com/

Atacms Missiles: ట్రంప్ ఆపేస్తానన్నాడు.. ఓడిన పగతో జోబైడెన్ మూడో ప్రపంచ యుద్ధం మొదలుపెట్టించాడా?

అది రావణ కష్టం. ఏడాదిగా రగులుతూనే ఉంది. రష్యా పట్టు విడవడం లేదు. ఉక్రెయిన్ వెనక్కి తగ్గడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నా.. ప్రపంచ దేశాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నా.. రెండు దేశాలు ఆగడం లేదు. యుద్ధాన్ని ఆపడం లేదు. ఇప్పుడు ఏకంగా ఆ రెండు దేశాల మధ్య యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసినట్టు తెలుస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 19, 2024 / 05:36 PM IST

    Atacms Missiles

    Follow us on

    Atacms Missiles: ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన ట్రంప్ రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని నిలిపేస్తానని ప్రకటించాడు. పుతిన్ కు సహకారం అందిస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఇది నెరవేరకముందే ప్రస్తుతం అధ్యక్షుడు బైడన్ తన ప్రతీకారాన్ని తీర్చుకోవడం మొదలుపెట్టాడు. రెండోసారి అధ్యక్షుడిగా పోటీ చేయలేకపోవడం.. ఒక్కసారి మాత్రమే అమెరికా అధ్యక్షుడుగా చేశాడని అపప్రదను మూటకట్టుకోవడం.. అడ్డి మారి గుడ్డి దెబ్బలో అధ్యక్షుడయ్యాడనే తీరుగా ట్రోల్ జరగడంతో.. బైడన్ తన ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టాడు. ట్రంప్ నిర్ణయాన్ని పరోక్షంగా వ్యతిరేకిస్తూ.. మరోసారి యుద్ధానికి రంగం చేశాడు. రష్యా – ఉక్రెయిన్ మధ్య నివురు గప్పిన నిప్పు లా ఉన్న పరిస్థితిని యుద్ధంలాగా మార్చేశాడు. నిన్నటిదాకా ఈ రెండు దేశాలు కాస్త శాంతి మంత్రాన్ని పాటించినప్పటికీ.. ఉక్రెయిన్ కు అమెరికా ATA CMS మిస్సైల్స్ ను అందించింది. ఇవి అత్యంత ఆధునిక లాంగ్ రేంజ్ మిస్సైల్స్. ఎలాంటి పరిస్థితుల్లోనైనా టార్గెట్ ను చేజ్ చేయగలవు. అమెరికా వీటిని అందించడంతో ఉక్రెయిన్ తొలిసారిగా రష్యాపై ప్రయోగించింది. మరోవైపు రష్యా కూడా అదే స్థాయిలో బదులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రష్యా వద్ద అత్యధిక న్యూక్లియర్ క్షిపణులు ఉన్నాయి. వీటిని ఉక్రెయిన్ పై ప్రయోగించాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు బైడన్ తమ అందిస్తున్న లాంగ్ రేంజ్ మిసైల్స్ ను రష్యాపై ప్రయోగించాలని ఉక్రెయిన్ కు పచ్చ జెండా ఊపాడు. దీంతో ఏ క్షణమైనా పరిస్థితి చేయి దాట వచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

    రష్యాకు ఉత్తర కొరియా సైనికులు

    నాటో, అమెరికా సహకారంతో ఉక్రెయిన్ విరుచుకుపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో రష్యా తన వంతు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. తన సైనిక బలాన్ని పెంపొందించుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా అమెరికాకు బద్ధ శత్రువైన ఉత్తర కొరియాతో సంధి కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఉత్తరకొరియా రష్యాకు సైనికులను పంపుతోంది. ఇప్పటికే ఒక దఫా సైనికులను రష్యాకు పంపింది. దీంతో వారు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించారు. రష్యా నుంచి ఆదేశాలు రాగానే యుద్ధంలో పాల్గొంటారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఉక్రెయిన్ పై రష్యా న్యూక్లియర్ మిస్సైల్స్ ప్రయోగిస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.