https://oktelugu.com/

Surya: అక్షరాలా 600 కోట్ల రూపాయిలు..’కంగువా’ ఫ్లాప్ తర్వాత కూడా చెక్కు చెదరని సూర్య మార్కెట్!

600 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ తెరకెక్కించబోతున్న కర్ణ చిత్రం లో నటించబోతున్నాడు. మహా భరతం లోని కర్ణుడి క్యారక్టర్ ని కథానాయకుడిగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట.

Written By: Vicky, Updated On : November 19, 2024 5:19 pm
Surya

Surya

Follow us on

Surya: సౌత్ ఇండియా లో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకడు సూర్య. తమిళంతో పాటు ఆయనకీ తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా సరిసమానమైన మార్కెట్ ఉంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కి తప్ప, సౌత్ ఇంతటి పూర్తి స్థాయి మార్కెట్ ఏ హీరోకి కూడా లేదు. కానీ సూర్య గత దశాబ్ద కాలం నుండి తన రేంజ్ కి తగ్గ సినిమాలు తీయడం లేదు. మధ్యలో కొన్ని హిట్స్, యావరేజ్ సినిమాలు వచ్చాయి కానీ, అవి సూర్య స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లలేకపోయాయి. అయితే సూర్య దురదృష్టం ఏమిటంటే, ఆయన నుండి వచ్చిన ‘ఆకాశమే నీ హద్దురా’, ‘జై భీం’ వంటి చిత్రం డైరెక్ట్ ఓటీటీ లో విడుదలయ్యాయి. ఈ సినిమాలు థియేటర్స్ లో విడుదల అయ్యుంటే పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేది. ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాలో అద్భుతంగా నటించినందుకు గాను సూర్య కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది.

ఈ రెండు సినిమాల తర్వాత థియేటర్స్ లో విడుదలైన ‘ఈటీ’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాపుగా నిలబడగా, మూడేళ్ళ సుదీర్ఘ విరామం తీసుకొని, డైరెక్టర్ శివతో ‘కండువా ‘ లాంటి భారీ బడ్జెట్ చిత్రం చేసాడు. రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. మొదటి రోజే వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుంది అనుకున్న ఈ సినిమా, ఇప్పుడు ఫుల్ రన్ లో కూడా ఆ మార్కుని అందుకోవడం కష్టమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఆ స్థాయి డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన ఈ సినిమా తర్వాత సూర్య పని ఇక అయిపోయింది అని అందరూ అనుకున్నారు. మళ్ళీ ఆయన కం బ్యాక్ ఇవ్వాలంటే ‘రోలెక్స్’ సినిమా రావాల్సిందే అని అంటున్నారు. కానీ అంతకంటే ముందే మరో క్రేజీ ప్రాజెక్ట్ ని సెట్ చేసాడు సూర్య.

600 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ తెరకెక్కించబోతున్న కర్ణ చిత్రం లో నటించబోతున్నాడు. మహా భరతం లోని కర్ణుడి క్యారక్టర్ ని కథానాయకుడిగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. డైరెక్టర్ ఎవరు, ఏమిటి అనేది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు కానీ, వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించబోతున్నారట. ఇక మిగిలిన పాత్రల్లో ఎవరు కంపించబోతున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. గతం లో ఈ ప్రాజెక్ట్ ని విక్రమ్ తో చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు అదే ప్రాజెక్ట్ సూర్య వద్దకు చేరింది . మన దేశంలో సినీ ప్రియులు ఈమధ్య మహాభారతం బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలను ఎగబడి చూస్తున్నారు. అందుకు ఉదాహరణ కల్కి చిత్రం. కర్ణుడి పాత్రను కేవలం రెండు నిమిషాలు చూపిస్తేనే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా ఆ పాత్ర మీద సినిమా అంటే ఏ రేంజ్ లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు.