Summer : ఎండలు( summer ) మండుతున్నాయి. భానుడు భగభగమంటున్నాడు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రజల్లో కనిపిస్తోంది. సంక్రాంతి తర్వాత ప్రారంభమైన ఎండల తీవ్రత ఇటీవల పతాక స్థాయికి చేరాయి. ఇప్పుడే 40 డిగ్రీలు దాటి ఎండ తీవ్రత పెరుగుతోంది అంటే.. మున్ముందు ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. వేసవి తొలి రోజుల్లోనే రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటల వరకు విపరీతమైన ఎండల తీవ్రత ఉంటోంది. ప్రజలు రోడ్ల మీదకు రావాలంటే భయపడిపోతున్నారు. గత రెండు రోజులుగా ఏపీలో చాలా మండలాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటింది.
Also Read : ఎండలోకి వెళ్లే ముందు ఈ చిట్కాలు పాటిస్తే.. వడదెబ్బకు గురికాకుండా ఉంటారు.. అవేంటంటే?
* ముందుగానే హెచ్చరికలు
వాస్తవానికి ఈ ఏడాది ఎండల తీవ్రత( Samar heat ) అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే మార్చి నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల లో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిమ్మాయపాలెం లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. ఈ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ రెండో వారానికి ప్రమాదకర స్థితిలోకి ఉష్ణోగ్రతలు చేరుకుంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
* ఉత్తరాంధ్రలో అధికం
ప్రస్తుతం ఉత్తరాంధ్రలో( North Andhra ) ఎండల తీవ్రత అధికంగా ఉంది. అనకాపల్లి, పార్వతీపురం మన్యం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. అయితే ఈ దశాబ్ద కాలంలో ఈ ఏడాది అధికంగా ఎండలు ఉండబోతున్నాయని ఇదివరకే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఎల్ నినో ప్రభావంతో సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం కూడా ఎండలు పెరగడానికి కారణం. ప్రస్తుతం ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండి.. పెద్దగా ఒక్క పోత అనిపించడం లేదు. కానీ ఎండల తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఒకేసారి భానుడు మండుతుండడంతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. వేసవిలో ప్రమాద కంటి కలు తప్పవని భావిస్తున్నారు.
Also Read : స్కూళ్లకు వేసవి సెలవులు.. తేదీ ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..