Pawan Kalyan
Pawan Kalyan : ఆంధ్ర రాజకీయాలతో పాటు.. జనసేన పుట్టుక.. ఈ స్థాయిలో ఎదగడం.. భవిష్యత్తు లక్ష్యాలను పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ సభ ద్వారా జనసైనికులకు మార్గం నిర్దేశనం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉటంకిస్తూనే.. హిందీ భాష ప్రాధాన్యం గురించి చెబుతూనే.. వైసిపి పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కష్టకాలంలో టిడిపికి జనసేన అండగా నిలిచిందని వ్యాఖ్యానించారు. ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించిన పార్టీగా జనసేన రికార్డు సృష్టించిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.. “జనసేన ప్రజల కష్టాలనుంచి పుట్టింది. ప్రజల ఇబ్బందులనుంచి పుట్టింది. ఇప్పుడు ప్రజల క్షేమం కోసమే పని చేస్తోంది. అధికారం కోసం కాదు.. ప్రజల బాగుకోసం జనసేన పని చేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు అధికారంలో భాగమైనప్పటికీ జనసేన తన లక్ష్యాలను ఎప్పుడూ మర్చిపోలేదని.. మర్చిపోయే అవకాశం లేదని” పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.
Also Read : తమిళనాడు ‘హిందీ’ వ్యతిరేకతల నోళ్లు మూయించిన పవన్ కళ్యాణ్*
తెలంగాణ కోటి రతనాల వీణ
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. తెలంగాణ కోటి రతనాల వీణ అని వ్యాఖ్యానించారు. కరెంట్ షాక్ తగిలి చావు చివరి అంచులో ఉన్న తనకు కొండగట్టు అంజన్న పునర్జన్మ ఇచ్చారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆ సమయంలో అభిమానుల దీవెనలు తనకు అండగా ఉన్నాయని వెల్లడించారు. కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ఇచ్చారు కాబట్టే ఆయన గుడికి తాను తరుచూ వెళ్తూ ఉంటానని.. తనవంతుగా ఆలయ అభివృద్ధికి చేయూత అందించానని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. “తెలంగాణ కోటి రతనాల వీణ. ఆ ప్రాంతం ఆప్యాయతలకు.. అనురాగాలకు పుట్టినిల్లు. కొండగట్టు అంజన్న నాకు పునర్జన్మ ఇచ్చాడు. అభిమానుల దీవెనలు కూడా ఆ సమయంలో నాకు అండగా ఉన్నాయి. కరెంట్ షాక్ తగిలి చావు చివరి అంచులో ఉన్నప్పుడు నాకు దేవుడు మళ్లీ జీవితాన్ని ఇచ్చాడు. అందువల్లే నేను తెలంగాణ ప్రాంతాన్ని.. కొండగట్టు అంజన్న స్వామిని మర్చిపోలేనని” పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో మాట్లాడారు. తెలంగాణ గురించి.. కొండగట్టు అంజన్న గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు జనసైనికులు ఈలలు వేయడం విశేషం. తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు కూడా స్పందిస్తున్నారు.. తెలంగాణను ఏర్పాటు చేసినప్పుడు 11 రోజులపాటు ఎందుకు ఉపవాసం ఉన్నాడో పవన్ కళ్యాణ్ చెప్పాలని వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.. జనసేన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం చేస్తుందో.. ప్రజల సమస్యల పరిష్కారానికి ఏం చేస్తుందో.. తదుపరి కార్యాచరణ ఏమిటో ప్రకటించకుండా.. ఆంధ్రప్రదేశ్ నేలపై తెలంగాణ ప్రస్తావన తేవాల్సిన అవసరం ఏముందని వైసీపీ నేతలు అంటున్నారు.
Also Read : టీడీపీని నిలబెట్టింది జనసేననే.. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై టిడిపి శ్రేణుల్లో ఆందోళన