Sound control : ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది సంచలనమే. అయితే ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ప్రజా ప్రయోజనం ఉంటుంది. ఇటీవలే మహాకుంభమేళా(Maha Kumbha Mela)ను దిగ్విజయంగా నిర్వహించారు. 45 రోజులు సాగిన ఈ కుంభమేలాలో చిన్నచిన్న ఘటనలు మినహా పెద్ద ప్రమాదాలేవీ జరగలేదు. ఇక కాలుష్యం పెరగలేదు. గంగా నది కలుషితం కాలేదు. ఇందుకు యోగి ముందస్తు ప్రణాళికే కీలకంగా మారింది. కుంభమేళా ముగియడంతో యూపీ సీఎం ఇప్పుడు రాష్ట్రంలోని పలు అంశాలపై దృష్టి పెట్టారు. మత స్థలాల్లో లౌడ్‌స్పీకర్ల(Loud Speekars)వాడకంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. మసీదులు, ఆలయాలు వంటి ప్రార్థనా స్థలాల్లో శబ్దం 55 డెసిబెల్స్(Desibels) కంటే తక్కువగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఏ మతానికి చెందిన స్థలమైనా లౌడ్‌స్పీకర్ల అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Also Read : పది రోజుల్లో రాజీనామా చేయ్.. లేదంటే బాబా సిద్ధిక్ గతే.. యూపీ సీఎంకు వార్నింగ్!
రాష్ట్ర అభివృద్ధిపై సమీక్ష..
రాష్ట్రంలో అభివృద్ధి. హోలీ పండుగ సన్నాహాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హోలీ సందర్భంగా అధిక శబ్దంతో కూడిన డీజేలను పూర్తిగా నిషేధించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, దుకాణాలు, వాణిజ్య కేంద్రాల వంటి ముఖ్య ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలను అమర్చాలని సూచించారు. పశువుల అక్రమ రవాణాను కట్టడి చేయడంలో కఠిన వైఖరి అవలంబించాలన్నారు. ఇందుకు సహకరించే స్మగ్లర్లు, వాహన యజమానులు లేదా పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు.
అభివృద్ధి నెమ్మదించడంపై..
రాష్ట్రంలో కొన్ని అభివృద్ధి ప్రాజెక్టులు నెమ్మదిగా సాగుతున్నాయని గుర్తించిన ఆయన, వీటిని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు.
ఎనిమిదేళ్లలో 210 కోట్ల మొక్కలు..
గడిచిన ఎనిమిది సంవత్సరాల్లో ఉత్తరప్రదేశ్‌లో 210 కోట్ల మొక్కలు నాటినట్లు యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. రాష్ట్రంలో పట్టణీకరణ వేగంగా పెరుగుతున్నప్పటికీ, ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల అటవీ విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సదస్సులో మాట్లాడుతూ, ప్రభుత్వం నాటిన 210 కోట్ల మొక్కలలో ఎన్ని బతికి ఉన్నాయో కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ మొక్కల్లో సుమారు 70 నుంచి 75 శాతం చెట్లు జీవించి ఉన్నాయని, అలాగే స్వచ్ఛంద సంస్థలు నాటిన మొక్కల్లో 65 నుంచి 70 శాతం వరకు బతికే రేటు ఉందని వివరించారు.
Also Read : పాలనా నమూనా ఎలా ఉండాలో చేసి చూపించిన యోగి ఆదిత్యనాథ్