Homeఆంధ్రప్రదేశ్‌Statue Politics in AP: ఏపీలో విపక్షాల పోరాటం పక్కదారి.. అధికారపక్షం ఖుషి!

Statue Politics in AP: ఏపీలో విపక్షాల పోరాటం పక్కదారి.. అధికారపక్షం ఖుషి!

Statue Politics in AP: ఏదైనా రాజకీయ పార్టీ, విపక్షాల పోరాటాలను బట్టి.. అధికారపక్షంపై ఉన్న ప్రజాభిప్రాయాన్ని గుర్తించవచ్చు. ఎప్పుడైతే ప్రభుత్వ ప్రజా వైఫల్యాలను ఎండగడితే.. అది నిజంగా ప్రజల్లోకి వెళ్తుంది. అధికార పక్షానికి ఇబ్బందిగా మారుతుంది. కానీ విపక్షాలు ఎప్పుడైతే సమాజంలో చీలిక తేవాలని ప్రయత్నిస్తాయో.. అక్కడ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్టు. గత కొద్ది రోజులుగా ఏపీలో ( Andhra Pradesh) విగ్రహాల రాజకీయం నడుస్తోంది. అంటే విపక్షాలకు పోరాడేందుకు ప్రజా సమస్యలు లేవు అని స్పష్టమవుతోంది.

ఎప్పుడూ భిన్నమే
ఏపీలో రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. అంతకంటే భిన్నంగా ఉంటుంది ఏపీ ప్రజల తీర్పు. వారి తీర్పు ఎప్పుడూ విలక్షణమే. 1983,1985 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించారు నందమూరి తారక రామారావు( Nandamuri Taraka Rama Rao ). కానీ 1989 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. మళ్లీ 1994లో గెలిచారు. 1999లో చంద్రబాబు నేతృత్వంలో టిడిపి గెలిచింది. 2004, 2009లో కాంగ్రెస్.. 2014లో టిడిపి.. 2019లో వైసీపీ.. 2024 ఎన్నికల్లో టిడిపి కూటమి విజయం సాధించాయి. అయితే ఇక్కడ ఒక్కటి గమనించదగ్గ విషయం. చంద్రబాబు వరుసగా రెండుసార్లు.. రాజశేఖర్ రెడ్డి వరుసగా రెండుసార్లు గెలిచారు. ఆ రెండుసార్లు వారి సమర్థతతోనే అధికారంలోకి వచ్చారు. విపక్షాలు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా వారు ఓడిపోలేదు.

చంద్రబాబుకు ప్రజామోదం..
1994లో నందమూరి తారకరామారావు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే టిడిపిలోకి లక్ష్మీపార్వతి( Lakshmi Parvathi ) ఎంట్రీ తర్వాత సీన్ మారింది. 1995లో టిడిపి చంద్రబాబు చేతిలోకి వచ్చింది. దానిని వెన్నుపోటు అన్న వారే అధికం. అదే వెన్నుపోటు అనుకుంటే.. 1999 ఎన్నికల్లో అదే చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చినట్టు? నందమూరి తారక రామారావు మరణం తర్వాత కూడా అది ఎందుకు సానుభూతిగా మారలేదు? చంద్రబాబుకు ఎందుకు ఇబ్బందికరంగా మారలేదు? అంటే ముమ్మాటికి తన నాలుగేళ్ల పదవీకాలంలో సమర్థ నాయకుడిగా నిరూపించుకున్నారు చంద్రబాబు. అందుకే 1999 ఎన్నికల్లో గెలవగలిగారు.

ప్రజా రంజక పాలనతోనే..
2004లో తన శక్తి యుక్తులను ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు రాజశేఖర్ రెడ్డి( Y S Rajasekhara Reddy ). కాంగ్రెస్ పార్టీ గెలవడంతో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఐదేళ్లపాటు ప్రజా రంజక పాలన అందించారు. అందుకే 2009 ఎన్నికల్లో ఒకవైపు ప్రజారాజ్యం.. ఇంకో వైపు టిడిపి నేతృత్వంలోని మహాకూటమిని కాదని కాంగ్రెస్ పార్టీని రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే అప్పట్లో విపక్షాలు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు. కేవలం రాజశేఖర్ రెడ్డి సమర్థతను గుర్తించి ప్రజలు ఆయనకు అధికారాన్ని కట్టబెట్టారు.

కొద్దిరోజులుగా విగ్రహాల రాజకీయం
నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా 2014లో అధికారం చేపట్టారు చంద్రబాబు( CM Chandrababu). కానీ 2019లో ఓడిపోయారు. అయితే గెలిచిన జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. అంటే ప్రజలు భిన్నంగా ఆలోచించారు. చంద్రబాబు హయాంలో సంక్షేమం లేకపోవడంతో…ఆ తరహా హామీలు ఇవ్వడంతో జగన్మోహన్ రెడ్డిని ఆదరించారు. అయితే సంక్షేమాన్ని నమ్ముకున్న జగన్ అభివృద్ధిని వదిలేశారు. దీనిపై కూడా ప్రజలు ఆగ్రహించారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి దారుణ ఓటమిని కట్టబెట్టారు. అయితే ఇప్పుడు చంద్రబాబు అధికారాన్ని చేపట్టారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులను జరిపిస్తున్నారు. దీనిపై ప్రజల నుంచి ఒక రకమైన సంతృప్తి కనిపిస్తోంది. అదే సమయంలో ప్రజా సమస్యలపై విపక్షాలు ఆందోళన చేయకపోవడాన్ని సైతం గుర్తించాలి. ప్రజా సమస్యలు ఉండి ఉంటే.. రాష్ట్రంలో విగ్రహ రాజకీయాలు ఎందుకు జరుగుతున్నట్టు? మొన్నటికి మొన్న వంగవీటి మోహన్ రంగ… నిన్నటికి నిన్న శ్రీకృష్ణుడు విగ్రహానికి సంబంధించి వివాదాలు ఎందుకు జరుగుతున్నట్టు? కేవలం ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు.. ప్రజా సమస్యలపై పోరాటం చేసే వీలు లేకపోయినందుకు.. ఇలా సరికొత్తగా ప్లాన్ చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రజల గురించి కాకుండా.. ప్రభుత్వంపై అపోహలు కలిగేందుకు చేసే ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఎవరి నమ్మకం వారిది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version