Janasena : జనసేన నేతను కొట్టిన సీఐకి గట్టి షాక్

జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారు దుమారం సృష్టించారు. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు, వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

Written By: NARESH, Updated On : July 14, 2023 9:58 pm
Follow us on

Janasena : అధికార బలంతో రెచ్చిపోయిన పోలీస్ ఆఫీసర్ కు గట్టి షాక్ తగించింది. జనసేన పార్టీకి చెందిన నేతపై తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి సర్కిల్ ఇన్ స్పెక్టర్ చేతితో కొట్టిన ఘటన గత బుధవారం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది.

తిరుపతి జిల్లా శ్రీ కాళహస్తికి చెందిన సీఐ అంజు యాదవ్ పై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. శ్రీకాళహస్తి సీఐకి మానవ హక్కుల కమిషన్ నోటీస్ జారీ, జనసేన నేతపై చేయి చేసుకోవడాన్ని సీరియస్ గా కమిషన్ పరిగణించింది. సుమోటోగా కేసు నమోదు చేసుకుంది.. ఈనెల 27 వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

జనసేన ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారు దుమారం సృష్టించారు. వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ నేతలు, వాలంటీర్లు ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఇందుకు ప్రతిగా శ్రీకాళహస్తిలో బుధవారం జనసేన ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్థానిక కళ్యాణ్ మండపం సమీపంలో పార్టీ జిల్లా కార్యదర్శి కొట్టె సాయి మహేష్ తోపాటు ఇతర నాయకులు సీఎం దిష్టబొమ్మను దహనం చేసేందుకు సిద్ధమయ్యారు.