Sri Rama Navami 2025: రాష్ట్రవ్యాప్తంగా శ్రీరామ నవమి( Sri Rama Navami ) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం ఉత్సవానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. సీతారాముల కళ్యాణం ఉత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ చర్యలు చేపడుతోంది. మరికొద్ది సేపట్లో నవమి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 14 వరకు కొనసాగనున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి భక్తుడికి ముత్యపు తలంబ్రాలు, అన్నప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. కళ్యాణ వేదిక ప్రాంగణం వద్ద గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఈ గ్యాలరీలలో ఉండే భక్తులతో పాటు కళ్యాణం చూసేందుకు వచ్చిన భక్తులకు సీతారాముల కళ్యాణం ఉత్సవాన్ని వీక్షించేలా ఏర్పాటు చేశారు.
Also Read: జమిలి ఎన్నికలపై కేంద్రానికి క్లారిటీ.. కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్థిక మంత్రి!
* ఏటా ప్రభుత్వం తరఫున..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒంటిమిట్టలో( vontimitta ) ఏటా స్వామివారి శ్రీరామనవమి వేడుకలు జరపడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కళ్యాణ వేదిక వద్ద తలంబ్రాలు పంపిణీ కోసం 16 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఆలయానికి వచ్చే భక్తులు సీతారాముల కళ్యాణం చూసేలా 15 ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఆలయంతో పాటు కళ్యాణ వేదిక వద్ద విద్యుత్ కాంతులతో 38 దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం సూచిక బోర్డులు, విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో 100 సిసి కెమెరాలు, మూడు డ్రోన్లు, మూడు కంట్రోల్ రూమ్ లు, 2400 మంది భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు.
* ప్రత్యేక తాగునీటి ఏర్పాట్లు..
వేసవి దృష్ట్యా తాగునీటి ఏర్పాట్లు ప్రత్యేకంగా చేశారు. బ్రహ్మోత్సవాలకు( brahmotsav) వచ్చే భక్తుల కోసం మూడు లక్షల వాటర్ బాటిల్స్, 250 మంది పారామెడికల్ సిబ్బంది, 35 మంది వైద్య నిపుణులు, 13 మెడికల్ టీంలు, 8 అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బందిని అందుబాటులో ఉంచారు. ఈరోజు నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈనెల 14తో ముగియనున్నాయి. ఈనెల 11న సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఒంటిమిట్టలో స్వామి వారి కళ్యాణం జరగనుంది. ఏప్రిల్ 12న రథోత్సవం నిర్వహిస్తారు. ఏప్రిల్ 14న చక్రస్నానం ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఒంటిమిట్టలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.