Nirmala Sitharaman: దేశవ్యాప్తంగా ఎన్నికలు ఒకేవిడతలో నిర్వహిస్తే ఆర్థికంగా దేశానికి కలిసి వస్తుందని కేంద్రం భావిస్తోంది. ఈ అంశంపై గతంలోనూ చర్చలు జరిగినా అర్ధంతరంగానే ఆగిపోయాయి. మోదీ ప్రభుత్వం(Modi Governmant) ఇప్పుడు ఒక కీలక అడుగు వేసింది. కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక తెప్పించుకుని ఆమోదం కూడా పొందింది. అయితే జమిలి ఎన్నికలు ఎప్పటి నుంచి అనే స్పష్టత ఇవ్వలేదు. తాజాగా అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala seetharaman)ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ’జమిలి ఎన్నికలు’ (One Nation One Election) గురించి మాట్లాడారు. ఈ విధానాన్ని వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అమలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన ఆమె, 2034 తర్వాతే దీన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.
Also Read: వైసీపీ ఎంపీ క్రాస్ ఓటింగ్.. వక్ఫ్ బిల్లులో కీలక పరిణామం!
లోక్‌సభ ఎన్నికలకే రూ.లక్ష కోట్ల ఖర్చు..
2024 లోక్‌సభ ఎన్నికల్లో సుమారు రూ.లక్ష కోట్లు ఖర్చయ్యాయని, జమిలి ఎన్నికలతో ఈ భారీ వ్యయాన్ని ఆదా చేయవచ్చని ఆమె వివరించారు. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ జీడీపీలో 1.5% పెరుగుదల సాధ్యమని, దీనివల్ల రూ.4.5 లక్షల కోట్ల ఆర్థిక లాభం చేకూరుతుందని ఆమె లెక్కలు చూపారు. ఈ విధానంపై కొన్ని రాజకీయ పార్టీలు అసత్య ప్రచారం చేస్తూ వ్యతిరేకిస్తున్నాయని నిర్మలా సీతారామన్ విమర్శించారు. జమిలి ఎన్నికల ఆలోచన కొత్తది కాదని, 1960 నుంచి ఈ చర్చ ఉనికిలో ఉందని ఆమె గుర్తు చేశారు. దివంగత డీఎంకే నేత కరుణానిధి(Karunanidhi) దీనికి మద్దతిచ్చినప్పటికీ, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(MK.Stalin) వ్యతిరేకిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
దేశ ప్రయోజనాల కోసమే..
ఈ విధానం ఏ ఒక్కరి వ్యక్తిగత ప్రాజెక్టు కాదని, దేశ ప్రయోజనాల కోసం రూపొందిందని నిర్మలాసీతారామన్ తెలిపారు. జమిలి ఎన్నికల వల్ల ఎన్నికల ఖర్చు తగ్గడమే కాకుండా, పరిపాలనా సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏటా వివిధ రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల వల్ల ప్రభుత్వ విధానాల అమలు, అభివృద్ధి పనులు తరచూ ఆగిపోతున్నాయి. ఒకే సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే ఈ సమస్య తగ్గి, రాజకీయ స్థిరత్వం పెరుగుతుందని సమర్థకులు వాదిస్తున్నారు. అయితే, వ్యతిరేకులు దీనివల్ల రాష్ట్ర స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని, స్థానిక సమస్యలు జాతీయ ఎజెండాలో కలిసిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది పునాది మాత్రమే..
ప్రస్తుతం ఈ విధానానికి పునాది వేసే పనులు జరుగుతున్నాయి. రాజ్యాంగ సవరణలు, ఎన్నికల సంఘం సంస్కరణలు వంటి అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. దీన్ని అమలు