Ap Liquor Policy : జగన్ కంటే చంద్రబాబు మేలు.. మద్యం షాపులతో వైసిపి నేతల ఖుషి!

  మరి కొద్ది గంటల్లో ఏపీవ్యాప్తంగా మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. పాత ప్రీమియం బ్రాండ్లు సరసమైన ధరలకు లభించనున్నాయి. 

Written By: Dharma, Updated On : October 15, 2024 11:18 am

Ap Liquor Policy

Follow us on

Ap Liquor Policy : : ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. అక్కడక్కడ చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఈసారి మద్యం వ్యాపారంతో సంబంధంలేని వారికి షాపులు దక్కాయి. షాపులు దక్కించుకుంటామని వందల దరఖాస్తులు వేసుకున్న  వ్యాపారులకు దురదృష్టం వెంటాడింది. కొందరికి ఒక్క షాపు కూడా దక్కలేదు. అయితే అనూహ్యంగా వైసిపి నేతలకు మద్యం దుకాణాలు లాటరీలో తగలడం విశేషం. ఏపీలో కూటమి నేతలు దూకుడుగా ఉంటారని వైసీపీ నేతలు అంచనా వేశారు. పెద్ద ఎత్తున షాపులు దక్కించుకుంటారని.. అధికార జులుం ప్రదర్శిస్తారని భావించారు. కానీ మద్యం దరఖాస్తుల విషయంలో ప్రభుత్వం సీరియస్ కావడంతో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. చాలామంది వైసిపి నేతలు సిండికేట్లలో పెట్టుబడులు పెట్టి  దరఖాస్తులు చేసుకున్నారు. అటువంటి వారికి షాపులు దక్కాయి. దీంతో వారు ఆనందంతో ఉన్నారు. గత ఐదేళ్ల వైసిపి పాలనలో తమకు ఎటువంటి ప్రయోజనం కలగలేదని.. ఇప్పుడు టిడిపి  ప్రభుత్వంలో మద్యం షాపులు దక్కాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లుగా ప్రభుత్వ మద్యం పాలసీ లో భాగంగా.. నేరుగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపింది. అసలు కిందిస్థాయి క్యాడర్ తో మద్యం దుకాణాలకు సంబంధం లేదు. మద్యం సరఫరా చేసే బాధ్యతను సైతం పెద్ద తలకాయలకు అప్పగించారు జగన్. దీంతో కింది స్థాయి నాయకులకు ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. అటువంటి వారికి ఈ ప్రభుత్వంలో షాపులు దక్కడంతో  వారి ఆనందానికి అవధులు లేవు.
 * టిడిపి నేతల్లో అసంతృప్తి
 అయితే టిడిపి నేతలు చాలామంది షాపులు దక్కక అసంతృప్తితో ఉన్నారు. ప్రభుత్వం నాన్ రిఫండబుల్ రుసుము ద్వారా 2000 కోట్ల రూపాయలు దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పారదర్శకంగా లాటరీ ప్రక్రియ చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశించింది. మద్యం షాపుల లాటరీలో తల దూర్చవద్దని మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించింది. అందుకే చాలామంది మంత్రులు తమ పార్టీ నేతల తరుపున దరఖాస్తు రుసుము చెల్లించారు.కానీ నేరుగా షాపులు కేటాయించేలా ఆదేశాలు ఇవ్వలేదు.
 * వైసీపీ హయాంలో వారికే ప్రయోజనం 
  ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రభుత్వమే నేరుగా దుకాణాలను నడిపింది. ఈ క్రమంలో మద్యం సరఫరా చేసే బాధ్యతలు పెద్ద నాయకులకు దక్కింది. వారే డిష్టలరీలను ఏర్పాటు చేసి.. షాపులకు మద్యం సరఫరా చేసే బాధ్యతను తీసుకున్నారు. అది కూడా రాష్ట్రస్థాయి నాయకులకు మాత్రమే ఆ అవకాశం దక్కింది. కిందిస్థాయి నాయకులకు ఎటువంటి అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వారికి ఉపాధి దొరికినట్లు అయ్యింది.