https://oktelugu.com/

Tirumala : ఎట్టకేలకు తిరుమలలో సిట్.. నేడు రేపో విచారణ స్టార్ట్

తిరుమల మరోసారి హాట్ టాపిక్ గా మారనుంది. లడ్డూ వివాదానికి సంబంధించి సిట్ విచారణ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి సన్నాహాలు కూడా ప్రారంభం అయ్యాయి.

Written By:
  • Dharma
  • , Updated On : November 23, 2024 1:57 pm
    SIT investigation

    SIT investigation

    Follow us on

    Tirumala :  టీటీడీ లడ్డూ వివాదం తేల్చేయడానికి సిట్ రంగంలోకి దిగింది. కొద్దిరోజుల కిందట చెలరేగిన ఈ వివాదం ప్రకంపనలకు దారితీసింది. ప్రపంచవ్యాప్తంగా మనోభావాలను దెబ్బతీసింది. వైసిపి ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డూలో జంతు కొవ్వు కలిపారని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సీఎం హోదాలో ఈ ప్రకటన చేశారు. దీంతో ఇది జాతీయ స్థాయిలో వివాదాస్పదంగా మారింది. వైసిపి కార్నర్ అయ్యింది. ఆ పార్టీపై జాతీయస్థాయిలో పెద్ద ఉద్యమమే నడిచింది. ఈ తరుణంలో వైసిపి కోర్టును ఆశ్రయించింది. అయితే అప్పటికే దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత అధికారుల బృందం సిట్ ను నియమించింది. అయితే కోర్టులో దీనిపై అభ్యంతరాలు తెలిపింది వైసిపి. ఆరోపించింది సాక్షాత్తు రాష్ట్రానికి సీఎం. దర్యాప్తునకు ఆదేశించింది కూడా ఆయనే. అందుకే సిబిఐ దర్యాప్తు కావాలని కోరింది వైసిపి. చివరకు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సిబిఐ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తూ సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది కోర్టు.న్యాయస్థానం ఆదేశాల మేరకుఇద్దరు సిబిఐ అధికారులు, మరో ఇద్దరూ రాష్ట్ర పోలీస్ అధికారులు, మరొక ఆహార కల్తీ నియంత్రణ అధికారిని జతచేస్తూ సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు.

    * కోర్టు తీర్పు నేపథ్యంలో
    అయితే కోర్టు తీర్పు వచ్చి నెలలు గడుస్తున్నా ఇంతవరకు సిట్ దర్యాప్తు ప్రారంభం కాలేదు. దీనిపై విమర్శలు రావడంతో ఎట్టకేలకు దర్యాప్తు బృందం తిరుపతిలో అడుగు పెట్టింది. సీట్ బృందం కోసం తిరుమలలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ కార్యాలయం నుంచే సీటు తన విచారణను నిర్వహించనుంది. వీరికి సహాయంగా 30 మందితో ప్రత్యేక టీమ్ ను కూడా నియమించారు. వీరిలో నలుగురు డిఎస్పీలు, ఎనిమిది మంది సీఐలు, ఇద్దరు ఎస్ఐలు ఉన్నారు. అయితే ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చాలా వరకు దర్యాప్తు చేసింది. అయితే ఈ కొత్త సిట్ దర్యాప్తు ప్రారంభించనున్న నేపథ్యంలో.. పాత విచారణను సైతం పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.

    * తిరుమలలో కార్యాలయం
    సిబిఐ అధికారులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఉన్నతాధికారులను నియమించారు. గుంటూరు రేంజ్ ఐజి సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఈ బృందంలో ఉన్నారు. ఇక సిబిఐ తరుపున హైదరాబాద్ జోన్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభు, విశాఖపట్నం ఎస్పీ మురళీ రాంబాతో పాటు ఆహార కల్తీ నియంత్రణ శాఖ నుంచి సలహాదారుడు డాక్టర్ సత్యేన్ కుమార్ పాండా ఉన్నారు. మొత్తంగా సిట్ దర్యాప్తు ప్రారంభమైన తర్వాత లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.మొత్తంగా సీట్ దర్యాప్తుతో మీడియా ఫోకస్ అంత తిరుమల పై ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.