https://oktelugu.com/

AP BJP President : ఏపీ బీజేపీకి కొత్త బాస్.. ఆ ఇద్దరిలోఎవరికి?

కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. భాగస్వామ్య పార్టీలుగా ఉంటూనే ఎవరికి వారు తమ పార్టీని అభివృద్ధి చేసేందుకు ఫోకస్ పెట్టారు. అయితే బిజెపి పగ్గాలు మార్చుతారని గత కొంతకాలంగా ప్రచారం నడుస్తోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 23, 2024 / 01:38 PM IST

    AP BJP President

    Follow us on

    AP BJP President :  ఏపీ బిజెపికి కొత్త అధ్యక్షుడు రానున్నారా? హై కమాండ్ సీరియస్ గా ఆలోచిస్తోందా? తెలంగాణతో పాటు ఇక్కడ కూడా అధ్యక్షుడిని ప్రకటించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఏడాది జూలైలో తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించారు. అందులో భాగంగా ఏపీకి దగ్గుపాటి పురందేశ్వరి నియమితులయ్యారు. కేవలం ఎన్నికల కోసమే అప్పుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి కట్టడం వెనుక పురందేశ్వరి కృషి ఉంది. పొత్తులో భాగంగా బిజెపి 8 అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంది. అదే సమయంలో మూడోసారి ఎన్డీఏ అధికారం చేపట్టడానికి అవసరమైన బలాన్ని ఏపీ అందించగలిగింది. టిడిపి తో పాటు జనసేన మద్దతు కీలకంగా మారింది. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు మార్చుతారని ప్రచారం ప్రారంభమైంది. దీనికి చాలా రకాల కారణాలు కూడా ఉన్నాయి.

    * ఆ సామాజిక వర్గానికి
    వైసిపి ప్రభావం చూపడానికి రెడ్డి సామాజిక వర్గం ప్రధాన కారణం. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ సామాజిక వర్గ ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో రెడ్డి సామాజిక వర్గం ప్రత్యామ్నాయం కోసం ఆలోచిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే వారికి బిజెపి కనిపిస్తోంది. అందుకే రెడ్డి సామాజిక వర్గానికి బిజెపి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ప్రయోజనం ఉంటుందని బిజెపి హై కమాండ్ కు నివేదికలు వెళ్లినట్లు తెలుస్తోంది. బలమైన రెడ్డి సామాజిక వర్గ నేతకు బిజెపి అధ్యక్ష బాధ్యతలు కట్టబెడతారని ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి కావడంతో ఆయన పేరును పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. మరి ఈ ఇద్దరిలో ఎవరి పేరు ఫైనల్ చేస్తారో చూడాలి..

    * పురందేశ్వరిని మార్చుతారా?
    దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బిజెపి అధ్యక్షులను చాలావరకు మార్చుతోంది హై కమాండ్. తెలంగాణ విషయానికి వచ్చేసరికి నేతల మధ్య గట్టి ఫైట్ ఉంది. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం అలా కాదు. అయితే పురందేశ్వరి తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేయగలిగారు. గత ఐదేళ్లుగా కనీస ప్రాతినిధ్యం లేదు బిజెపికి. అటువంటిది 8 అసెంబ్లీ సీట్లతో పాటు మూడు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకుంది ఆ పార్టీ. ఇది పురందేశ్వరికి కలిసివచ్చే అంశం. అందుకే ఆమెను ఇప్పట్లో మార్చారన్న ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.