https://oktelugu.com/

Johnny Master : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కి భారీ ఊరట..సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీమ్ కోర్టు!

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేసి, సుమారుగా నెల రోజులకు పైగా రిమాండ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ రిమాండ్ లో జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు.

Written By:
  • Vicky
  • , Updated On : November 23, 2024 / 02:03 PM IST

    Choreographer Johnny Master is a big relief..Supreme Court gave a shocking verdict!

    Follow us on

    Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ని లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేసి, సుమారుగా నెల రోజులకు పైగా రిమాండ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ రిమాండ్ లో జానీ మాస్టర్ కి వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో ఆయన మీద పోస్కో చట్టం క్రింద కేసు నమోదు అయ్యినప్పటికీ అరెస్ట్ చేయలేదు. పైగా రీసెంట్ గానే ఆయన మధ్యంతర బెయిల్ మీద బయటకి వచ్చాడు. ఇక నుండి ఆయన సినీ కెరీర్ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేము కానీ , బెయిల్ విషయంలో జానీ మాస్టర్ కి ఇప్పుడు పెద్ద రిలీఫ్ దొరికింది అనే చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళ్తే జానీ మాస్టర్ బెయిల్ ని రద్దు చెయ్యాలంటూ బాధితురాలి తరుపున న్యాయవాది సుప్రీమ్ కోర్టు లో పిటీషన్ వేశారు.

    శుక్రవారం నాడు ఈ బెయిల్ రద్దు పిటీషన్ విచారణకు రాగా జస్టీస్ భేలా ఏం త్రివేది, జస్టీస్ సతీష్ చంద్ర మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్ ని రద్దు చేసారు. హై కోర్టు అందించిన ఉత్తర్వులలో ఎలాంటి జోక్యం చేసుకోలేమని ఈ సందర్భంగా సుప్రీం కోర్టు తీర్పుని ఇచ్చింది. తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేస్తున్న శ్రేష్టి వర్మ, జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడని, పెళ్లి చేసుకోమని బెదిరించాడని, లేకపోతే సినిమాల్లో అవకాశాలు రాకుండా చేస్తామని అన్నాడని, ఇలా ఎన్నో రకాల ఆరోపణలు చేసింది. అయితే గతం తవ్వితే శ్రేష్టి వర్మ కూడా జానీ మాస్టర్ తో ఇస్టంగానే రిలేషన్ ని మైంటైన్ చేసినట్టుగా జనాలకు అనిపించింది. ఎదో విషయంలో గొడవలై, జానీ మాస్టర్ పై పగ తీర్చుకునేందుకు శ్రేష్టి వర్మ ఇలా కేసు పెట్టిందని, తనతో ఇంతకాలం స్నేహంగా ఉంటున్న ఒక కొరియోగ్రాఫర్ హస్తం కూడా ఇందులో ఉందనే వాదన కూడా సోషల్ మీడియా లో వినిపిస్తుంది. వీటిల్లో ఏది నిజం, ఏది అబద్దం అనేది తెలియాల్సి ఉంది.

    అయితే జానీ మాస్టర్ పై పోస్కో చట్టం క్రింద కేసు నమోదు అయిన కారణంగా, ఆయనకి వచ్చిన నేషనల్ అవార్డును కూడా జ్యూరీ వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది జానీ మాస్టర్ కి ఘోరమైన అవమానం అనే చెప్పాలి. గ్రూప్ డ్యాన్సర్ స్థాయి నుండి ఎంతో కష్టపడి జానీ మాస్టర్ నేషనల్ లెవెల్ లో టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు. ఆయన డేట్స్ కోసం స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు పడిగాపులు కాస్తున్న ఇలాంటి సమయంలో ఆయనకి కోలుకోలేని దెబ్బ పడింది. ఒకప్పటి లాగా క్రేజీ డిమాండ్ అయితే జానీ మాస్టర్ కి ఇప్పట్లో ఉండకపోవచ్చు. భవిష్యత్తులో ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. వాస్తవానికి ‘పుష్ప 2’ చిత్రంలో రెండు పాటలకు జానీ మాస్టర్ కి కొరియోగ్రఫీ చేసే అవకాశం వచ్చింది. కానీ రిమాండ్ లో ఉన్న కారణంగా జానీ మాస్టర్ కి రావాల్సిన అవకాశం వేరే కొరియోగ్రాఫర్ చేతుల్లోకి వెళ్ళింది.