Gaami Twitter Review: గామి ట్విట్టర్ టాక్: విశ్వక్ సేన్ సినిమాకు ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? ప్లస్ లు, మైనస్ లు ఇవే!

టైటిల్ ప్రకటనతోనే మూవీ మీద ఆసక్తి కలిగేలా చేశారు. ట్రైలర్ ఆకట్టుకోగా హైప్ పెరిగింది. గామి అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటింది. జనాలు గామి సినిమా చూడాలి అనుకుంటున్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనం.

Written By: S Reddy, Updated On : March 8, 2024 8:43 am

Gaami Twitter Review

Follow us on

Gaami Twitter Review: విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ గామి. పర్వదినం శివరాత్రి సందర్భంగా వరల్డ్ వైడ్ విడుదల చేశారు. గామి చిత్ర యూఎస్ ప్రీమియర్స్ యూఎస్ లో పడ్డాయి. ఇక ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. గామి చిత్రం పై మొదటి నుండి హైప్ ఉంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ కావడంతో ప్రభాస్ కూడా ప్రమోట్ చేశారు. టాలీవుడ్ యంగ్ హీరోస్ గామి చిత్ర ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. అలాగే గామి చిత్రం కోసం చాలా కష్ట పడినట్లు విశ్వక్ సేన్ చెప్పుకొచ్చారు.

టైటిల్ ప్రకటనతోనే మూవీ మీద ఆసక్తి కలిగేలా చేశారు. ట్రైలర్ ఆకట్టుకోగా హైప్ పెరిగింది. గామి అడ్వాన్స్ బుకింగ్స్ లో సత్తా చాటింది. జనాలు గామి సినిమా చూడాలి అనుకుంటున్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనం. గామి చిత్ర కథ విషయానికి వస్తే… అఘోర అయిన విశ్వక్ సేన్ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. అతడు మనుషులను తాకకూడదు. మనుషుల స్పర్శ విశ్వక్ ని వ్యాధిగ్రస్తుణ్ణి చేస్తుంది.

దీని పరిష్కారం వెతుక్కుంటూ విశ్వక్ సేన్ హిమాలయాలకు బయలుదేరుతాడు. కఠిన పరిస్థితుల మధ్య పోరాటం చేస్తాడు. అసలు ఈ అఘోర ఎవరు? అతని నేపథ్యం ఏమిటీ? ఈ వ్యాధికి కారణం ఏమిటీ? అనేది అసలు కథ. గామి మూవీ ఒక యూనిక్ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు విద్యాధర్ కాగిత ప్రతిభను ఆడియన్స్ కొనియాడుతున్నారు. అతడు ఎంచుకున్న స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని తెలియజేస్తున్నారు.

గామి చిత్రానికి విజువల్స్ ప్రధాన ఆకర్షణ. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, బీజీఎమ్ సైతం మెప్పిస్తాయి. విశ్వక్ సేన్ నటన మెచ్చుకోవాల్సిందే. కీలక పాత్రలో కనిపించిన చాందిని చౌదరి అలరించింది అంటున్నారు. అయితే సినిమా మెల్లగా సాగుతుంది. నేరేషన్ స్లోగా ఉందని అంటున్నారు. స్క్రీన్ ప్లే ఆకట్టుకున్న నేపథ్యంలో స్లో నేరేషన్ అయినప్పటికీ ప్రేక్షకుడు పెద్దగా బోర్ ఫీల్ కాడట. సినిమా చివరి 20 నిమిషాలు ఊపందుకుందని అంటున్నారు. మొత్తంగా గామి ఒకసారి చూడదగ్గ చిత్రమే అనేది ప్రేక్షకుల అభిప్రాయం.