Sharmila vs Congress leaders issue: వైయస్ షర్మిల( Y S Sharmila ) ఎందుకో ఈమధ్య సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పతనం అవుతుండడంతో ఆమెకు బెంగ పట్టుకున్నట్టు ఉంది. అందుకే మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఆమె పెద్దగా అంగీకరించడం లేదు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. కానీ తెలంగాణ ఉప ఎన్నికల్లో మాత్రం ఘన విజయం సాధించింది. అయినా షర్మిల సరైన రీతిలో స్పందించలేదు. దీంతో తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు పెరుగుతున్నాయి. పైగా షర్మిల నియామకం జరిగి దాదాపు రెండు సంవత్సరాలు అవుతోంది. ఆపై ఆమెపై సీనియర్ నేతలు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆమె వ్యక్తిగత అజెండాతో పని చేస్తున్నారన్నది ఆ ఫిర్యాదుల సారాంశం. అయితే షర్మిలపై ఫిర్యాదులు ఇప్పుడే కాదు.. గతంలో కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు షర్మిల సైలెంట్ కావడంతో ఆమెపై చర్యలు ఉంటాయని ప్రచారం ప్రారంభం అయింది. ఆశించిన స్థాయిలో ఆమె పనితీరు లేకపోవడంతో మార్చుతారని టాక్ నడుస్తోంది.
Also Read: జగన్ ఈసారైనా అక్కడికి వెళ్తారా?
మంచి నేపథ్యం..
2024 ఎన్నికల కు ముందు ఏపీ కాంగ్రెస్( AP Congress) అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నారు షర్మిల. అంతకుముందు తెలంగాణలో తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు. సుదీర్ఘకాలం తెలంగాణలో పాదయాత్ర చేశారు. అయితే అక్కడ రాజకీయాల్లో స్పేస్ లేక షర్మిలకు అవకాశం లేకుండా పోయింది. దీంతో గత్యంతరం లేని స్థితిలో ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా, మరో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరిగా షర్మిల కు మంచి గుర్తింపు ఉంటూ వచ్చింది. అయితే రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పతనం అయింది. మొన్నటి బీహార్ ఎన్నికల్లో అయితే తుడిచిపెట్టుకుపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కేవలం రెండు రాష్ట్రాల్లో మాత్రమే. ఏపీలో సైతం కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశం కనిపించడం లేదు. వైసిపి ఓడిపోయి 17 నెలలు అవుతున్న.. కాంగ్రెస్ పార్టీలో చేరికలు మాత్రం పెరగడం లేదు.
Also Read: చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సలహా!
పతనం అంచున కాంగ్రెస్..
జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ కనీస స్థాయిలో పుంజుకోకపోవడం మైనస్ గా మారింది. ఒక మంచి విజయం దక్కి ఉంటే దాని ప్రభావం ఏపీ పై పడే అవకాశం ఉంది. 2024 ఎన్నికల తరువాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని షర్మిల అంచనా వేసుకున్నారు. తద్వారా ఏపీలో క్రమేపి వైసిపి నిర్వీర్యం అవుతుందని.. ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ తిరిగి భర్తీ చేస్తుందని అంచనా వేసి.. ఆ పార్టీ సారధ్య బాధ్యతలు తీసుకున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క విజయం కూడా కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. ఉపశమనం కలిగించే విజయం దక్కించుకోలేదు. అందుకే ఆ పార్టీ అధ్యక్షురాలిగా ఉండడం ఎంత మాత్రం శ్రేయస్కరం కాదని షర్మిల భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు పార్టీ మారుతామంటే షర్మిల ముందు ఆప్షన్ లేదు. కచ్చితంగా కూటమి పార్టీల్లో చేరాల్సి ఉంటుంది. అయితే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఆమె.. జాతీయ పార్టీల్లో తప్ప ప్రాంతీయ పార్టీల్లో ఉండలేరు. అలాగని సోదరుడు వైయస్సార్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరలేరు.