https://oktelugu.com/

YS Sharmila: షర్మిలను టచ్ చేస్తే అట్లుంటది

ప్రస్తుతం రాయలసీమలో షర్మిల బస్సు యాత్ర కొనసాగుతోంది.తొలుత కడప జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర ప్రకంపనలు రేపింది. వివేకానంద రెడ్డి హత్య చుట్టూనే షర్మిల ఆరోపణలు సాగాయి.

Written By:
  • Dharma
  • , Updated On : April 20, 2024 1:11 pm
    YS Sharmila

    YS Sharmila

    Follow us on

    YS Sharmila: వైయస్ షర్మిల జగన్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. చిరకాల ప్రత్యర్థులకు మించి విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా డ్యామేజ్ చేస్తున్నారు. దీంతో షర్మిల నోటికి తాళం వేసేందుకు వైసిపి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కావు. కానీ పెద్దగా షర్మిల పట్టించుకోవడం లేదు. తన సభలకు వచ్చి అంతరాయం కలిగించాలనుకున్న వైసీపీ శ్రేణులకు ధీ టుగా సమాధానం చెబుతున్నారు. అదరడం లేదు. బెదరడం లేదు. రోజురోజుకు విమర్శల డోసు పెంచుతున్నారు. మంత్రుల అవినీతి, ప్రభుత్వ వైఫల్యాలు, వివేక హత్య అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీని కోలుకోలేని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే దీనిని జీర్ణించుకోలేని వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయి.

    ప్రస్తుతం రాయలసీమలో షర్మిల బస్సు యాత్ర కొనసాగుతోంది.తొలుత కడప జిల్లాలో ప్రారంభమైన ఈ యాత్ర ప్రకంపనలు రేపింది. వివేకానంద రెడ్డి హత్య చుట్టూనే షర్మిల ఆరోపణలు సాగాయి. దీంతో వైసిపి కోర్టుకు వెళ్లి మరి షర్మిల నోటికి తాళం వేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు కొత్త వ్యూహాన్ని షర్మిల ఎంచుకున్నారు. కోర్టు ఆదేశాలతో వివేక అంశాన్ని పక్కన పెట్టి.. ప్రభుత్వ వైఫల్యాలను తనదైన రీతిలో ప్రస్తావిస్తుండడంతో..జగన్ తోపాటు వైసీపీకి భారీ డ్యామేజ్ జరుగుతోంది. ఆ పార్టీ శ్రేణుల్లో కలవరానికి అదే కారణమవుతోంది.

    ఆదోనిలో పర్యటిస్తున్న షర్మిలను అడ్డుకోవడానికి వైసిపి శ్రేణులు ప్రయత్నించాయి. కొంతమంది వైసీపీ జెండాలు పట్టుకుని వచ్చారు. సిద్ధం సిద్ధం అంటూ నినాదాలు చేశారు. అందుకు షర్మిల స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. దేనికి సిద్ధం? మళ్లీ బిజెపికి గులాం గిరి చేయడానికా? రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు సిద్ధమా? మళ్లీ 11 లక్షల కోట్లు అప్పులు చేసేందుకు సిద్ధమా? రైతులను దారుణంగా వంచించేందుకు సిద్ధమా? మద్య నిషేధం మాట తప్పినందుకు సిద్ధమా? దేనికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి అన్నా? అంటూ షర్మిల ప్రశ్నించడంతో వారు నీళ్లు నమిలారు. మేము కూడా సిద్ధంగా ఉన్నామని.. వైసీపీని గద్దించేందుకు అంటూ తన ప్రసంగాన్ని కొనసాగించడంతో.. వైసీపీ జెండాలు పట్టుకున్న వారు అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు. కెలికి తిట్టించుకోవడం ఇదేనంటూ సెటైర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.సోషల్ మీడియాలో షర్మిల కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.