YCP: వైసీపీకి సెప్టెంబర్ గండం.. జగన్ ఫ్లైట్ ఎక్కిన మరుక్షణం కీలక పరిణామాలు!

తెలుగుదేశం పార్టీకి కొన్ని రకాల సంక్షోభాలు సెంటిమెంట్ గా వస్తున్నాయి.కొన్ని నెలల్లో ఆ పార్టీలో కీలక పరిణామాలు జరుగుతుంటాయి.ఇప్పుడు ఆ వంతు వైసీపీకి వచ్చినట్టు ఉంది.వచ్చే నెలలో ఆ పార్టీలో పరిణామాలు శరవేగంగా మారుతాయని తెలుస్తోంది.

Written By: Dharma, Updated On : August 24, 2024 1:11 pm

YCP

Follow us on

YCP: బొత్స విషయంలో వైసిపి వేరే ఆలోచనతో ఉందా? ఆయనకు అనవసరంగా ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టామని బాధపడుతోందా? శాసనమండలి విపక్ష నేతగా ఏదైనా చేస్తారన్న భయం వెంటాడుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీలో అంతర్గతంగా ఇదే చర్చ నడుస్తోంది. వాస్తవానికి వైసీపీ ఆవిర్భావం నుంచి బొత్స లేరు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోనే ఆయన కొనసాగారు. కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందని ఆశించారు. అదే జరిగితే రాష్ట్రంలో తాను కీలకంగా మారుతానని భావించారు. అయితే కాంగ్రెస్ పుంజుకోకపోవడంతో వెనుకబడి పోతానని భావించి వైసిపిలో చేరారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఉత్తరాంధ్రలో పార్టీ విజయానికి దోహదపడ్డారు. జగన్ క్యాబినెట్లో చోటు దక్కినా..రాష్ట్రంలో కీలక పదవి దక్కించుకోలేకపోయాను అన్న లోటు ఆయనను వెంటాడుతుంది. కాంగ్రెస్ పార్టీ లైవ్ లో ఉంటే తాను అనుకున్నది సాధించే వాడినని బొత్స భావిస్తున్నారు. అయితే ఇప్పుడు జగన్ ను నమ్ముకుని దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే అనుకోని వరంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో వైసిపి పక్ష నేతగా కూడా ఎంపికయ్యారు. చేజేతులా జగన్ బొత్సకు వరం అందించారు. ఇక ఆయన దూసుకుపోతారన్న ప్రచారం బలంగా సాగుతోంది.

* బొత్సకు అరుదైన గౌరవం
ప్రస్తుతం జగన్ ప్రతిపక్ష నేత కాదు. ఆయనకు ఆ హోదా దక్కలేదు. బొత్స కు మాత్రం క్యాబినెట్ హోదా దక్కనుంది. జగన్ కంటే గౌరవం లభించనుంది. వైసీపీ నేతల్లో అనుమానానికి అదే కారణం. బొత్స రాజకీయం గురించి అందరికీ తెలుసు. గురువు పెనుమత్స సాంబశివ రాజుని లెక్క చేయలేదు.అటువంటిది జగన్ ఒక లెక్క అని నేతలు అనుమానిస్తున్నారు. బొత్స శాసనమండలిలో ప్రతిపక్ష నేత. ప్రభుత్వం వద్ద పలుకుబడి ఉంటుంది. అందుకే ఏదైనా చేయాలనుకుంటే చేస్తారని కంగారు పడుతున్నారు. బొత్స వద్ద చాలా రకాల ప్లాన్లు ఉన్నాయని.. త్వరలో వాటిని అమలు చేస్తారని వైసీపీ నేతలు అంతర్గత సమావేశంలో చెప్పుకుంటున్నారు.

* లండన్ వెళ్ళనున్న జగన్
వచ్చే నెలలో జగన్ విదేశాలకు వెళ్ళనున్నారు. లండన్ లో పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు. వారి చదువు కూడా పూర్తయింది. అయినా సరే వారు అక్కడ చదువుకుంటున్నారని.. వారిని చూసేందుకు వెళుతున్నానని చెప్పి సిబిఐ కోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. సిబిఐ అడ్డుకోవాలని చూస్తున్నా..గత అనుభవాల దృష్ట్యా జగన్ కు తప్పకుండా అనుమతి లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

* ప్రశాంతంగా ఉండగలరా
అయితే జగన్ విదేశాలకు వెళ్లినా.. ప్రశాంతత మాత్రం దొరికే పరిస్థితి లేదు. ఒకవైపు బొత్స రూపంలో బలమైన ప్రత్యామ్నాయం కనిపిస్తోంది. ఇంకోవైపు రాజ్యసభ సభ్యులు యూటర్న్ తీసుకుంటారా? అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. జగన్ ఫ్లైట్ ఎక్కిన మరుక్షణం వైసీపీలో రాజకీయాలు మారిపోతాయని.. సొంత పార్టీ నేతలు అనుమానించే దాకా పరిస్థితి వచ్చింది. సో సెప్టెంబర్ లో వైసీపీలో కీలక పరిణామాలు ఉండబోతున్నాయన్నమాట.