https://oktelugu.com/

YCP MLAs: ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు సెంటిమెంట్ అడ్డంకి!

ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు సైతం పదవులను వదులుకుంటున్నారు. ఈ తరుణంలో విశాఖ ఏజెన్సీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలపై బలమైన చర్చ సాగుతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : November 18, 2024 / 10:29 AM IST

    YCP Party

    Follow us on

    YCP MLAs: టిడిపిలోకి వెళ్లే వైసిపి ఎమ్మెల్యేలు ఎవరు? ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కుతారని ప్రచారం సాగుతోంది. అందులో రాయలసీమ నుంచి ఒకరు, ఉత్తరాంధ్ర నుంచి మరొకరు అని టాక్ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ గెలిచింది కేవలం 11 స్థానాల్లో మాత్రమే. జగన్ తో పాటు పెద్దిరెడ్డి,బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి లాంటి వారు మాత్రమే అత్యంత నమ్మకస్తులు. మిగతావారు ఎక్కువగా రిజర్వుడు నియోజకవర్గాల నుంచి గెలిచిన వారే. దీంతో వారిపైనే అనుమానాలు పెరుగుతున్నాయి. రకరకాల ప్రచారం నడుస్తోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ఎమ్మెల్యేలు జంప్ అవుతారన్న అంశాన్ని లైట్ తీసుకుంటున్నారు.ఏదైనా సాధ్యమేనని చెబుతున్నారు. ఇప్పటికే ముగ్గురు రాజ్యసభ సభ్యులు, నలుగురు ఎమ్మెల్సీలు పదవులను సైతం వదులుకున్నారు. పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలపై అనుమానాలు ప్రారంభమయ్యాయి.

    * ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరే
    ఉత్తరాంధ్రలో వైసీపీ గెలిచింది రెండు స్థానాల్లోనే. ఆ రెండు సీట్లు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలోనివి. పాడేరు నుంచి మత్స్యరాస విశ్వేశ్వర రాజు, అరకు నుంచి మత్స్యలింగం ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇద్దరూ ఎస్టీ ఎమ్మెల్యేలే. అయితే వైసీపీకి వీర విధేయతతో ఉన్నారు. పదేపదే తాము జగన్ వెంట నడుస్తామని చెబుతున్నారు. అయితే టిడిపిలో ఈ ఇద్దరిలో ఎవరు చేరుతారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అయితే వీరు ఒక సెంటిమెంటును గౌరవించి వైసీపీలో కొనసాగే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి.

    * పార్టీ ఫిరాయిస్తే ఓటమే
    వైసీపీ నుంచి ఫిరాయించిన వారు ఇక్కడ గెలవడం అసాధ్యం. 2014లో పాడేరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు గిడ్డి ఈశ్వరి. తర్వాత టిడిపిలోకి ఫిరాయించారు.కానీ 2019, 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. కూటమి ప్రభంజనంలో సైతం ఈశ్వరి గెలవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.అరకు ఎంపీ కొత్తపల్లి గీత ది అదే పరిస్థితి. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున ఎంపీగా అరకు పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు. అటు తర్వాత బిజెపిలోకి ఫిరాయించారు. గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయారు. వైసీపీ నుంచి ఫిరాయించిన వారు ఎట్టి పరిస్థితుల్లో ఏజెన్సీలో గెలవరని ఒక సెంటిమెంట్ నడుస్తోంది. అందుకే ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీలో కొనసాగుతారని తెలుస్తోంది.