Border Gavaskar Trophy : టీమిండియా ఇప్పటికే ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ఆ ప్రాక్టీస్ అత్యంత ఆశాజనకంగా జరగలేదు. భారత్ – ఏ జట్టుతో భారత జాతీయ జట్టు ఆటగాళ్లు తలపడ్డారు. అయితే భారత – ఏ జట్టు బౌలర్ల ముందు జాతీయ జట్టు ఆటగాళ్లు తేలిపోయారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, గిల్ వంటి ఆటగాళ్లు గాయపడ్డారు. యశస్వి జైస్వాల్ కూడా గాయపడ్డాడని వార్తలు వచ్చాయి. అయితే వీరిలో గిల్ తొలి టెస్ట్ కు దూరం అవుతాడని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అతని స్థానంలో ధృవ్ జురెల్ కు ఆడే అవకాశం వస్తుందని తెలుస్తోంది. అయితే దీనిపై బీసీసీఐ ఇంతవరకు క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు కెప్టెన్ రోహిత్ శర్మ వ్యక్తిగత కారణాల వల్ల తొలి టెస్ట్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ బుమ్రా భారత జట్టుకు నాయకత్వం వహిస్తాడని తెలుస్తోంది. గాయపడిన కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, జైస్వాల్ పూర్తిస్థాయి సామర్థ్యాన్ని సాధించారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి..
యువ ఆటగాళ్లు వెనక్కి
సీనియర్ ఆటగాళ్ల కంటే ముందు ఆస్ట్రేలియా వెళ్లిన భారత – ఏ జట్టు ఆటగాళ్లు స్వదేశానికి బయలుదేరారు. వారు ఇటీవల ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. ఆస్ట్రేలియా – ఏ జట్టుతో రెండు అనధికారిక టెస్టులు ఆడారు.. అయితే రెండు మ్యాచ్లలోనూ భారత – ఏ జట్టు ఆటగాళ్లు ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలో భారత – ఏ జట్టులో కీలకంగా ఉన్న రుతు రాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ స్వదేశానికి వెళ్ళిపోయారు. అయితే వీరిని ఆస్ట్రేలియాలోనే ఉండాలని బీసీసీఐ సూచించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. వారు భారత – ఏ జట్టు ఆటగాళ్లతో కలిసి స్వదేశానికి వెళ్ళిపోయారు. అంటే ఈ ప్రకారం వారు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ఐపీఎల్ లో రుతు రాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్ సత్తా చాటారు. వీరిలో రుతు రాజ్ గైక్వాడ్ ఐపీఎల్ లో చెన్నై జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. గత సీజన్లో ధోని కెప్టెన్సీ నుంచి తట్టుకోవడంతో.. గైక్వాడ్ ధోని వారసుడిగా చెన్నై జట్టుకు సారధిగా కొనసాగుతున్నాడు.
జట్టులో అవకాశం లేదు
ఈసారి కూడా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దక్కించుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఇందులో భాగంగానే అనేక ప్రణాళికలు రచిస్తోంది. గత రెండు సీజన్లో టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ దక్కించుకుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని భావిస్తోంది. అయితే స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఓడిపోయింది. చరిత్రలో తొలిసారిగా వైట్ వాష్ కు గురైంది. దీంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడం టీమిండియా కు కష్టతరంగా మారింది. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాలంటే కచ్చితంగా ఆస్ట్రేలియా పై 4-0 తేడాతో టెస్ట్ సిరీస్ గెలవాల్సి ఉంది.