Tirumala : కలియుగ దైవం శ్రీవేకంటేశ్వరస్వామి కొలువుదీరిన క్షేత్రం తిరుమల(Thirumala). ప్రపంచంలో ఎక్కువ మంది భక్తలు దర్శించుకునే „ó త్రం కూడా తిరుమలే. ఇక ఆ ఏడుకొండలవాడు ప్రపంచంలోరె రెండో అత్యంత సంసన్నుడు. నిత్యం కోట్ల రూపాయల ఆదాయం స్వామివారికి వస్తుంది. ఇక ఆయన దర్శనం కోసం లక్షల మంది నిత్యం వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడిగా కొలిచే తిరుమల వేంకటేశ్వరస్వామి(Lard Venkateshwara)కి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. దేశం నలుమూలల నుంచే కాకుండా విదేశీ భక్తలు కూడా తిరుమలకు వస్తుంటారు. అయితే తిరుమల ఆరు నెలలుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. రెండు నెలల క్రితం లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం సంచలనంగా మారింది. తర్వాత వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. ఈ ఘటన మరువక ముందే.. తిరుమల ఆలయం పరకామణిలో చోరీ జరిగింది.
100 గ్రాముల బంగారం..
తిరుమలలో స్వామివారి కానుకలు నిల్వ ఉంచే పరకామణిలో ఉద్యోగే కన్నం వేశాడు. బంగాంర చోరీ చేసిన గంటలోపే విజిలెన్స్(Vigilance) అధికారులు గుర్తించి నిందితుడిని పట్టుకున్నారు. పెంచలయ్య అనే బ్యాంకు కాంట్రాక్టు ఉద్యోగి పరకామణి మండపంలోని 100 గ్రాముల బంగారం బిస్కెట్ దొంగిలించి వ్యర్థాలు బయటకు తీసుకెళ్లే ట్రాలీలో ఉంచాడు. బయటకు వచ్చిన ట్రాలీలను టీటీడీ విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. ట్రాలీ కిందకు వంచినప్పుడు బంగారం బిస్కెట్ బయటపడింది. సీసీ కెమరాలను విజిలెన్స్ అధికారులు పంరిశీలించారు. ఈ బంగారం బిస్కెట్‌ను పెంచలయ్య చోరీ చేసిట్లు నిర్ధారించారు.
విచారణలో విస్తుపోయే నిజాలు..
బంగారం బిస్కెట్(Gold bisket) చోరీ కేసు కీలక మలుపు తిరిగింది. దొంగనం చేసి దొరికిపోయిన పెంచలయ్యను పోలీసులు అదుపలోకి తీసుకుని వచిరాణ చేశారు. ఆయన చెప్పిన విషయాలు విని పోలీసులే విస్తుపోయారు. తిరుపతికి చెందిన వీరిశెట్టి పుంచలయ్య అగ్రిగోస్ కంపెనీ ద్వారా కాంట్రాక్టు ఉద్యోగిగా రెండేళ్లుగా శ్రీవారి పరకామణిలో పనిచేస్తున్నాడు. ఈజీగా డబ్బులు సంపాదించాలని పరకామణిలో గోల్డ్ స్టోరేజ్ గదిలో ఉంచే బంగారు వస్తువులు అపహరించడం మొదలు పెట్టాడు. పెంచలయ్య వ్యవహారంపై అనుమానం రావడంతో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అతనిపై నిఘా పెట్టారు. జనవరి 11న మధ్యాహ్నం గెల్డ్ స్టోరేజీ గదిలో ఉన్న 100 గ్రాముల బిస్కెట్ దొంగిలించి ట్రాలీకి ఉన్న పైపులో దాచాడు. తనిఖీ సమయంలో భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో పెంచలయ్య పారిపోయాడు.
గతంలోనూ చోరీలు..
విచారణలో పెంచలయ్య నుంచి పోలీసులు 555 గ్రాముల బంగారు బిక్కెట్లు, 100 గ్రాముల ఆభరణాలు, 157 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.46 లక్షలు ఉంటుందని అంచనా. రెండేళ్లలోనే ఈ చోరీలకు పాల్పడినట్లు నిర్ధారించారు. ఈజీగా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఇలా చేశారని విచారణలో పెంచలయ్య అంగీకరించాడు.