Sankranthiki Vasthunnam Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనిల్ రావిపూడి ఖాతాలో మరొక సక్సెస్ ని సాధించిపెట్టిందా? లేదా అనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇండియా లోనే అత్యంత పెద్ద బిజినెస్ మేన్ అయిన సత్య ఆకెళ్ళ (శ్రీనివాస్ అవసరాల) గారిని తెలంగాణ సీఎం హైదరాబాద్ కి ఆహ్వానిస్తారు. అందులో భాగంగానే ఆరోజు ఆయన కిడ్నాప్ అవుతాడు. ఇక ఈ విషయం బయట తెలిస్తే ఇబ్బంది అవుతుంది అనుకున్న సీఎం (నరేష్) ఐజి (సత్య సాయి శ్రీనివాస్) సహాయంతో ఈ విషయం బయటికి తెలియకుండా చూడమంటాడు.
దాంతో పోలీస్ ఆఫీసర్ అయిన మీనాక్షి (మీనాక్షి చౌదరి) సత్య ఆకెళ్ళ గారి ప్లేస్ లో అతనిలా ఉన్న మరొక వ్యక్తిని పెట్టి ఒక నాలుగు రోజులలు మేనేజ్ చేస్తే ఈ టైమ్ లో సత్య ఆకెళ్ళ గారిని ఎక్కడున్నా కూడా పట్టుకొని తీసుకురావచ్చని చూస్తుంటారు.
మరి ఈ క్రమంలోనే సిన్సియర్ ఆఫీసర్ అయిన మీనాక్షి చౌదరి కి తోడుగా రాజు (వెంకటేష్) అనే ఒక సస్పెండ్ ఆఫీసర్ ను నియమించాలని చూస్తారు. నిజానికి సిస్టంలో ఉన్న డిస్టబెన్స్ ని తట్టుకోలేక సస్పెండ్ అయిన రాజు వెంటనే ఉద్యోగాన్ని వదిలేసి భాగ్యలక్ష్మి (ఐశ్వర్య రాజేష్) అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని నలుగురు పిల్లలనుకంటాడు.
అలాగే ఆయన గోదావరి ఇంటికి అల్లుడు అయి చాలా ప్రశాంతంగా ఉంటాడు. మరి ఇలాంటి సందర్భంలో కాకి డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడని రాజు మీనాక్షి ద్వారా సత్య ఆకెళ్ళ గారిని తీసుకురావడానికి వెళ్లాడా? లేదా రాజు భార్య భాగ్యం తన మొగుడికి తనే సర్వస్వం అనుకుంటూ ఉంటుంది. మరి ఇంతలోనే మీనాక్షితో అతనికి లవ్ ఎఫైర్ ఉందని తెలుసుకున్న ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుంది అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమాని అనిల్ రావిపూడి మొదటి నుంచి చివరి వరకు కామెడీ ఎంటర్ టైనర్ గా మలిచాడు. ఎక్కడైతే సినిమా స్టార్ట్ అవుతుందో స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా పరిగెత్తుతూనే ఉంటుంది. ఎక్కడ కూడా కొంచెం బోర్ లేకుండా సినిమాని ముందుకు తీసుకెళ్లడంలో అనిల్ రావిపూడి సక్సెస్ అయ్యాడనే చెప్పాలి… ఇక ఆయన రాసుకున్న కొన్ని సీక్వెన్స్ లు కూడా ఈ సినిమాలో చాలా బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా వెంకటేష్ కొడుకుగా చేసిన చిన్నపిల్లాడు చేసిన కామెడీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. కోరుకుతా అనే మేనరిజంతో కూడిన ఒక డైలాగ్ ని బుడ్డోడి ద్వారా చెప్పించడం అలాగే ఫస్ట్ ఆఫ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్ గా వెళుతూ కామెడీగా నడిపించాడు.
ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి సత్య ఆకెళ్ళ గారిని సేవ్ చేసే ప్రాసెస్ లో ఇద్దరు హీరోయిన్ల మధ్య వెంకటేష్ కి ఎలా నలిగిపోతున్నాడనే విషయాన్ని చాలా స్పష్టంగా చూపించడమే కాకుండా వాళ్ళిద్దరికి ఉన్న ఇగో వల్ల ఆయన ఎలా సఫర్ అవుతున్నాడనేది కూడా బాగా చూపించి మెప్పించాడు. మరి మొత్తానికైతే అనిల్ ఈ సినిమాతో మరొక సక్సెస్ అయితే అందుకున్నాడు. వెంకటేష్ లాంటి స్టార్ హీరో గత సంవత్సర సంక్రాంతికి సైంధవ్ లాంటి సీరియస్ సినిమాతో వచ్చి ప్లాప్ ను మూటగట్టుకున్నాడు. కానీ ఈసారి మాత్రం నవ్వులు పూయిస్తూ సంక్రాంతి విన్నర్ గా నిలిచాడనే చెప్పాలి…
ఇక అనిమల్ సినిమాలో ఒక డిఫరెంట్ మేనరిజంతో నటించిన ఉపేంద్ర గారిని ఈ సినిమాలో చర్లపల్లి జైల్ కి జైలర్ పాత్ర లో చూపించి కామెడీని జనరేట్ చేశారు. మరి మొత్తానికైతే ప్రతి క్యారెక్టర్ ని చాలా బాగా వాడుకున్నారనే చెప్పాలి… అనిల్ రావిపూడి అంటే రొటీన్ సినిమాలను చేస్తూ ఉంటాడనే ముద్ర అయితే ఆయన మీద బలంగా పడిపోయింది. కాబట్టి ఈ సినిమా కూడా రొటీన్ గా సాగిన కూడా ప్రేక్షకులను ఎంగేజ్ అయితే చేస్తుంది. కాబట్టి ఈ సినిమా చూడడానికి చాలా మంది జనాలు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమా మొత్తాన్ని వెంకటేష్ తన భుజాల మీద మోసుకెళ్లాడనే చెప్పాలి. నిజానికి ఈ సినిమాలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలానే ఉన్నప్పటికి వెంకటేష్ మాత్రం ఈ సినిమాలో ఎక్స్ ట్రా ఆర్డినరీ కామెడీ చేసి మెప్పించాడు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ ఇద్దరూ కూడా వెంకటేష్ కి జోడి గా నటించి మెప్పించారు. వెంకటేష్ భార్య పాత్రలో ఒదిగిపోయి నటించిన ఐశ్వర్య రాజేష్ కి చాలా మంచి స్కోప్ అయితే దక్కింది.
అలాగే తన పాత్రకి థియేటర్లో విజిల్స్ అయితే పడుతున్నాయి. అలాగే ఒక పెక్కులర్ యాక్టింగ్ తో ఆమె నటన చాలా బాగుందనే చెప్పాలి. ఇక ఇలాంటి ఒక సినిమాలో శ్రీనివాస్ రెడ్డి, సాయికుమార్, విటివి గణేష్ లాంటి నటులు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు.
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి భీమ్స్ ఎక్స్ట్రాడినరీగా మ్యూజిక్ ని అందించడమే కాకుండా సినిమా సాంగ్స్ ని చాట్ బ్లాస్టర్ గా నిలిపాడు. అందువల్లే ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చడంతో పాటుగా ఈ సంక్రాంతి పండుగను రెట్టింపు చేసే విధంగా తన బాణిలతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా ఆయన చాలా బాగా హెల్ప్ చేశాడనే చెప్పాలి…ఇక సమీర్ రెడ్డి అందించిన విజువల్స్ కూడా ఈ సినిమాకి చాలా బాగా ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా గోదావరి అందాలను చాలా బాగా చూపించాడు. ఇక తన విజువల్స్ తో సినిమాను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళాడు…
ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి…
ప్లస్ పాయింట్స్
కామెడీ సీన్స్
వెంకటేష్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
కథ
ట్విస్టులు లేకుండా ప్లాట్ గా ఉండటం
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.75/5