ఆంధ్రప్రదేశ్‌Pawankalyan Varahi Yatra : జనమా.. జన సైనికుల వనమా.. వారాహి యాత్రకు నీరా‘జనం’!

Pawankalyan Varahi Yatra : జనమా.. జన సైనికుల వనమా.. వారాహి యాత్రకు నీరా‘జనం’!

Pawankalyan Varahi Yatra : ఆంధ్రప్రదేశ్‌కు వైసీపీ పాలన నుంచి విముక్తి కల్పించాలన్న సకల్పంతో ప్రతీ అడుగూ వ్యూహాత్మకంగా వేస్తున్న జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌.. వారాహియాత్రకు శ్రీకారం చుట్టారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సన్నిధి నుంచి జూన్‌ 14న బుధవారం యాత్ర ప్రారంభించారు. అంతకుముందు సత్యదేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం కత్తిపూడిలో బహిరంగ సభ నిర్వహించారు.

అడుగడుగునా ఘన స్వాగతం..
అన్నవరం నుంచి కత్తిపూడి వరకు పవన్‌ కళ్యాణ్‌కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. పవన్‌ యాత్ర సుగుతున్న రోడ్లకు ఇరువైపులా జన సైనికులు, ప్రజలు నిరాజనాలు పలికారు. దారిపొడవునా జై జనసేన.. జై పవన్‌ కళ్యాణ్‌ నినాదాలు మారుమోగాయి. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అందరికీ అభివాదం చేస్తూ వారిలో ఉత్సాహం నింపుతూ ముందుకు సాగారు. దీంతో రహదారికి ఇరువైపులా జనసేన జెండాలు, జనమే కనిపించారు.

పోటెత్తిన ‘జన’ కెరటం..
అన్నవరం నుంచి కత్తిపూడి వరకు రహదారికి ఇరువైపులా సాగిన జన ప్రవాహం.. కత్తిపూడిలో సభా ప్రాంగణంలో జన కెరటమై పోటెత్తింది. పవన్‌ వారాహియాత్ర తొలి సభకు భారీగా తరలివచ్చిన జనం, జనసైనికులతో కత్తిపూడి కిటకిటలాడింది. అభిమానులు, జనం, జన సైనికులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు పవన్‌ కళ్యాణ్‌.

కరవాలం పట్టి.. ఉత్సాహం నింపి..
ఇక కత్తిపూడి సభలో పవన్‌ కళ్యాణ్‌కు అభిమానులు కరావలం(కత్తి) బహూకరించారు. వారాహి వాహనంపై నిలబడిన జనసేనాని దానిని తిప్పుతు అభిమానుల్లో ఉత్సాహం నింపారు. పవన్‌ కత్తి పట్టగానే సభా ప్రాంగణం సీఎం.. సీఎం అనే నినాదాలతో హోరెత్తింది.

‘కత్తి’లాంటి పంచులు..
ఇక కత్తిపూడి సభలో జనసేనాని ప్రసంగం ఆసాంతం అందరినీ ఆకట్టుకుంది. కత్తిలాంటి పంచుంలతో వైసీపీ పాలనను ఎండగట్టారు. జగన్‌ పేరు ఎత్తకుండా పెద్దమనిషి అంటూ తనపై సీఎం చేసిన ప్రతీ ఆరోపణకు బదులిచ్చారు. దీంతో సభాప్రాంగణం, కత్తిపూడి వీధులన్నీ జనసేన నినాధాలతో మార్మోగాయి. తొలిసభకే జనం కెరటంలా పోటెత్తడంతో జనసేన నేతల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పది రోజులపాటు రెండు ఉమ్మడి జిల్లాల్లో సాగే యాత్ర, నిర్వహించే పది సభలను మరింత ఉత్సాహంతో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Andhra Pradesh Cyclone Warning : ఏపీ వైపు దూసుకు వస్తున్న ప్రళయ భీకర విపత్తు!

Andhra Pradesh Cyclone Warning : ఏపీకి( Andhra Pradesh) తుఫాన్ ముప్పు వెంటాడుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కోస్తా జిల్లాల వైపు దూసుకొస్తోంది. ఇది తీవ్రమైన వాయుగుండం గా మారింది....

PawanKalyan Health : పవన్ కళ్యాణ్ నెలకు ఒకసారి అస్వస్థతకు గురి కావడానికి కారణాలు ఇవేనా!

PawanKalyan Health : గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) తీవ్రమైన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు. మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న ఆయన, రీసెంట్ గానే...

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....
Tammineni Sitaram

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...