Homeఆంధ్రప్రదేశ్‌YS Viveka Assets : వైఎస్ వివేకా దగ్గరున్న ఆస్తులు ఎవరివి? ఎలా వచ్చాయి?

YS Viveka Assets : వైఎస్ వివేకా దగ్గరున్న ఆస్తులు ఎవరివి? ఎలా వచ్చాయి?

YS Viveka Assets : వివేకా హత్య కేసులో ఎన్నో కోణాలు, మరెన్నో అనుమానాలున్నాయి. ప్రధానంగా రాజకీయ కోణం చుట్టూనే విచారణ కొనసాగుతోంది. కానీ దీని వెనుక ఆస్తుల వివాదాలు కూడా ఉన్నాయన్న ప్రచారం ఉంది. నిందితులుగా పేర్కొంటున్న వారు ఈ తరహా ఆరోపణలే చేశారు. వివేకా పేరిట ఉన్న 300 కోట్ల రూపాయల ఆస్తులే కారణమన్న వాదనలు ఉన్నాయి. వివేకా ఆస్తులు పితాృర్జితంగా వచ్చినవి కావని..అవన్నీ సోదరుడు రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తరువాతే కొనుగోలు చేసినవన్న ఆరోపణలున్నాయి. వాటని స్వాధీనం చేసుకునేందుకు జగన్ ప్రయత్నించడంతో సునీత అడ్డం తిరిగారన్న ప్రచారం ఉంది.

యెడుగూరి సందింటి ..ఈ పేరుకో చరిత్ర ఉంది. రాష్ట్ర రాజకీయాలనే శాసిస్తోంది. దీనికి బీజం వేసింది మాత్రం యెడుగూరి సందింటి రాజారెడ్డి. కడప జిల్లా పులివెందులలో ఓ చిన్నపాటి వ్యాపారి. ఎక్కడో బలపనూరు అనే కుగ్రామం నుంచి పులివెందుల చేరుకున్న ఆయన  మైనింగ్ వ్యాపారంలో అడుగుపెట్టి  అభివృద్ధి సాధించారు.  ఆ ప్రాంతంలో పట్టు సాధించారు. అదే స్థాయిలో శత్రుత్వాన్ని మూటగట్టుకున్నారు. హత్యకు గురయ్యారు. రాజశేఖర్ రెడ్డి రంగంలోకి దిగిన తరువాతే ఆ కుటుంబం రాజకీయ యవనికపై నిలబడింది. ఆర్థికంగా బలోపేతమైంది.

2019 ఎన్నికలకు ముందు.. మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. తొలుత గుండెపోటుగా చిత్రీకరించారు. తరువాత హత్య అని తేల్చేశారు. రాజకీయ ప్రత్యర్థులకు ఇది మైనస్ గా మారింది. జగన్ కు ఎంతగానో లాభించింది. కానీ వివేకా కుమార్తె సునీత వ్యూహాత్మకంగా మౌనం పాటించింది. జగన్ సీఎం అయిన తరువాత కొన్నాళ్లకు బయటకు వచ్చి పోరాటం చేసింది. షర్మిళ మద్దతుతోనే ఆమె న్యాయపోరాటం చేయడం ప్రారంభించారన్న టాక్ ఉంది. అయితే అంతుకు మించి ఒక బలమైన కారణం ఉందన్న టాక్ నడుస్తోంది. వివేకా పేరు మీద ఉన్న వందల కోట్ల ఆస్తుల లెక్క తేల్చాలని జగన్ కోరడంతోనే సునీత ఎదురుతిరిగారని తెలుస్తోంది. నాడు రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజకీయంగా సంపాదించిన ఆస్తి బినామీ రూపంలో వివేకాకు కట్టబెట్టారని.. అవి తిరిగి కావాలని జగన్ కోరడంతోనే సునీత అడ్డం తిరిగారన్న ప్రచారం ఉంది.

హత్యకు ముందు వివేకా ఆర్థిక ఇబ్బందులు పడ్డారన్న ప్రచారం ఉంది. ఆయనకు నగదు కంటే ఆస్తుల రూపంలోనే ఎక్కువ మొత్తం ఉండేది. పులివెందుల మునిసిపాలిటీ రంగాపురం నందు 48.24 ఎకరాలు. ఇక్కడ ఎకరా రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లుపై మాటే. సింహాద్రిపురం మండలం రావులకొలనులో 21.49 ఎకరాలు. ఇక్కడ ఎకరా భూమి ధర రూ.15 లక్షల పైమాటే. అదే మండలంలోని నిడివెల్లలో 10.63 ఎకరాలు. ఇక్కడ ధర రూ.20 లక్షలు. తెలికి గ్రామంలో 9.47 ఎకరాలు. ఇక్కడ ఎకరా భూమి రూ.15 లక్షలు. ఇలా మొత్తం 89.83 ఎకరాల భూమి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇదంతా రాజశేఖర్ రెడ్డి హయాంలో సంపాదించిందేనన్న టాక్ ఉంది. ఆ కుటుంబంలో చిచ్చురేపడానికి ఈ ఆస్తులే కారణమన్న ప్రచారం ఒకటి నడుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular